Swetha
ఈ ఏడాది భారీ హైప్ తో రావాల్సిన సినిమాలన్ని వచ్చేశాయి. వాటిలో కొన్ని హిట్స్ పడితే కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక అంత హైప్ ఉన్న సినిమాలలో బ్యాలన్స్ ఉన్న మూవీ అఖండ 2 నే. ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత క్రిస్మస్ కు రసవత్తరంగా పోటీ జరగనుంది. డిసెంబర్ 25 డేట్ ను మొదట లాక్ చేసుకుంది అడవి శేష్ డెకాయిట్.

ఈ ఏడాది భారీ హైప్ తో రావాల్సిన సినిమాలన్ని వచ్చేశాయి. వాటిలో కొన్ని హిట్స్ పడితే కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక అంత హైప్ ఉన్న సినిమాలలో బ్యాలన్స్ ఉన్న మూవీ అఖండ 2 నే. ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత క్రిస్మస్ కు రసవత్తరంగా పోటీ జరగనుంది. డిసెంబర్ 25 డేట్ ను మొదట లాక్ చేసుకుంది అడవి శేష్ డెకాయిట్. ఈ సినిమా మీద ఆడియన్స్ కు చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ శృతిహాసన్ తప్పుకోవడం మృణాల్ ఎంటర్ అవ్వడం వలన షూట్ కాస్త లేట్ అయింది. అయితే ఈసారి ఈ డేట్ అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదని టీం స్ట్రాంగ్ గా చెప్తుంది.
ఇక ఈ సినిమాకు పోటీగా రాబోతున్న మూవీ ‘ఛాంపియన్’. శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేస్తున్నాడు. పెళ్లి సందడి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఛాంపియన్ తో రాబోతున్నాడు. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది. దీనికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించాడు. షూట్ అంతా కంప్లీట్ అయినప్పటికీ ఏడాది పైగా హోల్డ్ లో పెట్టినట్టు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం రోషన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఈ రేస్ లో విన్ అవ్వడం ఇంపార్టెంట్.
వీటికి కాంపిటీషన్ గా వస్తున్న మూవీ ఆల్ఫా. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యునివర్స్ లో భాగంగా రూపొందిన ఈ లేడీ గూఢచారి సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. వార్ 2 ఎండ్ లో చూపించిన బాబీ డియోల్ సీన్ ఆల్ఫాలోదే. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ది అనకొండ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఉన్న సినిమాలు ఇవి. కానీ సడెన్ గా ఇంకా ఏమైనా సినిమాలు ఈ రేస్ లో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.