Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. కాంతార సినిమా అందరిని మెప్పించింది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టింది. దీనితో వెంటనే సినిమాకు ప్రిక్వెల్ ను అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ ముందు వరకు సినిమా చుట్టూ నెగెటివినే స్ప్రెడ్ అయింది
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. కాంతార సినిమా అందరిని మెప్పించింది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టింది. దీనితో వెంటనే సినిమాకు ప్రిక్వెల్ ను అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ ముందు వరకు సినిమా చుట్టూ నెగెటివినే స్ప్రెడ్ అయింది
Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. కాంతార సినిమా అందరిని మెప్పించింది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టింది. దీనితో వెంటనే సినిమాకు ప్రిక్వెల్ ను అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ ముందు వరకు సినిమా చుట్టూ నెగెటివినే స్ప్రెడ్ అయింది. దీనితో ఈ రెండో భాగం ఎలా ఉండబోతుందా అని టీం కాస్త సందేహ పడ్డారు. కానీ ఊహించని విధంగా మొదటి వీకెండ్ లోనే మూడు వందల కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరికి ఆశ్చర్యం కలిగించింది.
మొదటి భాగానికి సిక్వెల్ గా ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో బాహుబలి , పుష్ప , కెజిఎఫ్ లు తప్ప ఏది ఆ ప్రామిస్ ను నిలబెట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా వచ్చిన చాప్టర్ 1 కూడా ఆ మార్క్ ను అందుకుంది. అంచనాలకు మించి ఇప్పుడు 500 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. వెయ్యి కోట్లు అందుకుంటుందా అంటే చెప్పలేం కానీ.. దీపావళి వరకు మాత్రం ఈ సినిమాను తిరుగు లేదు. అయితే ఈ రెండు సినిమాలను చూసిన తర్వాత ఇప్పుడు అంతా చాప్టర్ 2 కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు.
కానీ ఇప్పట్లో ఈ చాప్టర్ 2 వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే రిషబ్ శెట్టి ప్రస్తుతానికి దర్శకత్వ బాధ్యతల నుంచి విరామం తీసుకుని.. కేవలం నటన మీదే ద్రుష్టి పెట్టాలని అనుకుంటున్నారట. పైగా అటు జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి క్యారెక్టర్ కు ఇప్పటికే వస్తున్న హైప్ ఎలా ఉందొ తెలియనిది కాదు. సో కాంతారా చాప్టర్ 2 కు హోంబాలే ఫిలిమ్స్ రెడీగా ఉన్నా సరే రిషబ్ శెట్టి మాత్రం రెడీగా లేడని ఇన్సైడ్ టాక్. పైగా దీనిని ఇంకాస్త డిఫరెంట్ గా ఉండేలా చూసుకునేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటున్నాడట రిషబ్. సో రీజన్ ఏదైనా కానీ కాంతారా చాప్టర్ 2 మాత్రం ఇప్పట్లో లేనట్టే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.