iDreamPost
android-app
ios-app

10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం

  • Published Oct 07, 2025 | 1:12 PM Updated Updated Oct 07, 2025 | 1:12 PM

షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ తో పాటు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన తారాగణంగా ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన బల్టీ చిత్రం ఈ నెల 10 న విడుదలవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు.

  • Published Oct 07, 2025 | 1:12 PMUpdated Oct 07, 2025 | 1:12 PM
10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం

షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్ తో పాటు ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన తారాగణంగా ఉన్ని శివలింగం దర్శకత్వంలో తమిళ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన బల్టీ చిత్రం ఈ నెల 10 న విడుదలవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ ’ తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయడం జరుగుతోంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో ఆర్.డి.ఎక్స్ సినిమాతో గత సంవత్సరం ఘన విజయాన్ని సొంతం చేసుకొని మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు అని అన్నారు.

దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ ’ తమిళనాడు మరియు కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జ‌రిగే ఔట్ అండ్ ఔట్ రా ర‌స్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా వుంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్ద‌లు వారి మ‌ధ్య జ‌రిగే వ్యాపార రాజ‌కీయాల్లో న‌లుగురు క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ చిక్కుకోవ‌డం, ఆపై వ‌చ్చే ఘ‌ర్ష‌ణ‌లు, భావోద్వేగాల స‌మాహారంగా బ‌ల్టీ (Balti) సినిమా వుంటుంది అని అన్నారు.

పి.ఆర్.ఓ.
దయ్యాల అశోక్
కడలి రాంబాబు