అశ్వత్థామ…..చాలా సిన్సియర్ సినిమా…
సినిమాకి ఉండే రెగ్యులర్ కమర్షియల్ హంగులులు లేకుండా వీలయినంత బ్యాలెన్స్డ్ గా చేసిన సినిమా “అశ్వత్థామ”
నిజంగా ఈ సినిమాకి నేను అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను.
బట్ ఆశించినదానికంటే అశ్వత్థామ ఎక్కువగానే సంతృప్తిపరిచాడు.
ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకునో,చిన్న ప్రాబ్లం ని పట్టుకునో,ఒక చిన్న లైన్ ని పట్టుకునో చేసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ..
అది మనకు తమిళ్ లో,హింది లో ఎక్కువగా కనపడుతుంది.
హిందిలో వచ్చిన “పింక్” లాంటి సినిమాలు కానీ,లేదా తమిళ్ లో వచ్చిన
“అరం” లాంటి ఒక సంఘటను బేస్ చేసుకునే రియలిస్టిక్ సినిమాలు తెలుగులో ఎప్పుడో ఒకసారి వస్తాయి.
అలాంటి ఒక సినిమా “అశ్వత్థామ”..
ఈ సినిమాకి స్టోరీ నాగశౌర్య.
మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ కి ఇది డెబ్యూ సినిమా…
ఒక డెబ్యూ సినిమా డైరెక్టర్ దగ్గర కథ ఎందుకు లేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నే. అయినా ఎవరు ఏం చేశారన్నది పక్కనపెడితే ఫైనల్ గా సినిమా ఔట్ పుటే ఇంపార్టెంట్ కాబట్టి అది బాగుంది కాబట్టి ఆ క్రెడిట్ మొదటగా డైరెక్టర్ & హీరోకే వస్తుంది.
ఈ సినిమా డైరెక్టర్ ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయకుండానే ఈ సినిమా చేశరంట..
అది నిజంగా గొప్ప విషయమే..
స్క్రిప్ట్ పరంగా మేకింగ్ పరంగా ఒక అనుభవమున్న డైరెక్టర్ లా చేశాడు.
డైరెక్టర్ కి మంచి భవిష్యత్తు ఉందని అనిపించింది.
నాగశౌర్య తన గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
మిగతా సినిమాలతో పోలిస్తే చాలా హ్యాండ్సం గా మ్యాన్లీగా ఉన్నాడు.
మెహ్రిన్ కూడా తన అన్ని సినిమాల్లో కంటే ఇందులోనే అందంగా ఉంది.
ఖచ్చితంగా అది డైరెక్టర్ అండ్ కెమెరామాన్ గొప్పతనమే…
ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది విలన్ జిష్షు సేన్ గుప్త గురించి.
అనుమానం లేకుండా ఈ మధ్యకాలం లో బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకున్న నటుల్లో ఖచ్చితంగా ఇతనిది గుర్తింపబడే ఉత్తమ నటన.
గతం లో ఈయన మణికర్ణిక సినిమాలో కంగనారనౌత్ భర్తగా నటించాడు.
ఇంట్రెస్టింగ్ సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయ్..
అయిదు అంబులెన్సుల కోసం హీరో బైక్ మీద సిటీ అంతా చేజ్ చెయ్యడం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది.
విలన్ చిన్నప్పటి ఎపిసోడ్ సినిమాకే హైలైట్.
మొన్న మొన్న వచ్చిన “రాక్షసుడు” సినిమా ఫ్లాష్ బ్యాక్ కి ఎంతయితే ఎగ్సైట్మెంట్ ఫీల్ అవుతామో ఈ సినిమాలోని విలన్ చైల్డ్ ఎపిసోడ్ కి కూడా అంతే ఎగ్సైట్మెంట్ ఫీల్ అవుతాము.
విలన్ చిన్నప్పుడు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ బాగా పర్ఫార్మ్ చేశారు.
కెమెరా వర్క్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించినప్పటికీ …ఫైనల్ గా ఈ వీకెండ్ లో ఒక మంచి సినిమా… ఈ “అశ్వత్థామ”
Dont miss it..
మళ్ళీ ఒక మంచి సినిమాతో మాత్రమే కలుద్దాం.
థ్యాంక్యూ.. – TNR