iDreamPost
android-app
ios-app

Chiranjeevi : చిరు నిర్ణయం వెనుక అసలు మతలబు

  • Published Oct 23, 2021 | 7:06 AM Updated Updated Oct 23, 2021 | 7:06 AM
Chiranjeevi : చిరు నిర్ణయం వెనుక అసలు మతలబు

సైరా తర్వాత అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగులతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆచార్య ఫిబ్రవరి 4 లాక్ చేసుకుంది కాబట్టి ఇక రిలీజ్ డేట్ గురించి కొనసాగిన సస్పెన్స్ ముగిసిపోయింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. చేతికి సర్జరీ కావడంతో రెండు వారాలు బ్రేక్ తీసుకున్న చిరు ఆ తర్వాత డాక్టర్ల సలహాలను బట్టి షూట్ లో వెంటనే పాల్గొనాలో లేదో నిర్ణయించుకుంటారు. దీన్ని బట్టే విడుదల తేదీల్లో మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. గాడ్ ఫాదర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయట.

దీని సంగతలా ఉంచితే భోళా శంకర్ ని కొంత ఆలస్యం చేసే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఎలాగూ గాడ్ ఫాదర్ రీమేక్ బట్టి మళ్ళీ వెంటనే ఇంకో రీమేక్ అంటే అంచనాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో దాని స్థానంలో బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసిన ప్రాజెక్టుకి నవంబర్ 6 నుంచి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు గట్టి ప్రచారమే జరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు మహతి స్వర సాగర్ తో దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ మ్యూజిక్ సిట్టింగ్స్ ని పూర్తి చేయడంలో బిజీ ఉన్నాడు.

ఇవి కాకుండా మారుతీ డైరెక్షన్ లో యువి సంస్థకు ఒక సినిమా చిరు కమిట్ అయ్యారని మరో న్యూస్ ఉంది కానీ ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇవన్నీ పూర్తి చేయడానికే 2023 దాటిపోతుంది. అందుకే కొత్త సినిమాలకు మెగాస్టార్ సైన్ చేయరని అంటున్నారు. అదే నిజమైతే త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. పూరి జగన్నాధ్, కృష్ణవంశీ లాంటి సీనియర్ దర్శకులు సైతం చిరుతో సినిమా చేయాలనే కలను నెరవేర్చుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు కానీ అవి ఎంతవరకు సఫలీకృతమవుతాయో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి ఇంత స్పీడ్ చూపించడం విశేషం

Also Read : Radhe Shyam Teaser : నీ గురించి తెలిసినా చెప్పనంటున్న ప్రభాస్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet