ముదిరిపోతున్న అమెరికా-చైనా వివాదం ..స్టాక్ ఎక్స్చేంజి నుండి చైనా కంపెనీల ఔట్

కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వివాదం బాగా ముదిపోతోంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుండి ప్రపంచంలోనే బాగా పాపులరైన చైనా కంపెనీలను డీ లిస్టింగ్ చేసేసింది అగ్రరాజ్యం. వైరస్ సమస్య కాస్త చివరకు వాణిజ్య పోరగా మారిపోతోంది. ప్రపంచంలోనే పాపులరైన ఆలీబాబా, హువావే లాంటి సంస్ధలను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి నుండి బ్యాన్ చేసింది. 5 జీ టెలికాం పరికరాలను అందించే హువావే సంస్ధతో అమెరికాలోని సంస్ధలేవీ వ్యాపార సంబంధాలు పెట్టుకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారిచేశాడు.

తాజాగా ట్రంప్ ఆదేశాలతో చైనాకు చెందిన అనేక కంపెనీల ఆర్ధిక పరిస్ధితులు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలీబాబా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులరో అందరికీ తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దెబ్బకు కంపెనీ షేర్ వాల్యు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదంలో పడింది. ఒక్క ఆలీబాబానే కాదు అనేక కంపెనీల షేర్లు కూడా కుప్పకూలిపోతుందనటంలో సందేహం లేదు.

ఈ విషయాన్ని బహుశా చైనా ముందే ఊహించినట్లుంది. అందుకనే ట్రంప్ ఆదేశాలు వెలుగు చూడగానే వెంటనే చైనా చూపి బ్రిటన్ వైపు పడిందని సమాచారం. అమెరికా స్టాక్ ఎక్సేంజీల్లో తమ కంపెనీలను డీ లిస్టు చేసేస్తే వెంటనే లండన్ స్టాక్ ఎక్స్చేంజీల్లో తమ కంపెనీలను లిస్టు చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా నాస్ డాక్ తో పాటు స్టాక్ ఎక్స్చేంజీల్లో సుమారు 170 కంపెనీలు లిస్టయ్యాయి. పెట్రో చైనా, చైనా లైఫ్, చైనా టెలికాం, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, బైదు, ఆలీబాబా, జీడీడాట్ కామ్ లాంటి అనేక కంపెనీలున్నాయి. వీటిల్లో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్స్, బైదు, జేడీడాట్ కామ్ కంపెనీల మార్కెట్ విలువే సుమారు 500 బిలియన్ డాలర్లుంటుందని అంచనా.

అమెరికాకు నుండి ఎదురైన సమస్యకు బ్రిటన్ ను చైనా ప్రత్యామ్నాయంగా చూసినా మొత్తానికి దెబ్బ దెబ్బే అని చెప్పాలి. ఒక్కసారిగా చైనాకు చెందిన 170 కంపెనీలు అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుండి డీలిస్టు అవ్వటమంటే మామూలు విషయం కాదు. దీని ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి అమెరికా దెబ్బకు చైనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. మొత్తం మీద ఈ వ్యవహారం ఎలా తయారయ్యిందంటే అమెరికా-చైనా మధ్య తీవ్రమవుతున్న పోరు ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతుందనటంలో సందేహం లేదు.

Show comments