iDreamPost
android-app
ios-app

వీడియో: రిపోర్టర్ సాహసం..మెచ్చుకోకుండా ఉండలేరు!

Hurricane Helene Floods: సాధారణంగా రిపోర్టర్లు బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తల కోసం ఆరాపడుతుంటారు. కానీ ఓ రిపోర్టర్ మాత్రం అందరికి భిన్నంగా తన వృతిని వదిలేసి.. మానవత్వం చాటుకున్నాడు.

Hurricane Helene Floods: సాధారణంగా రిపోర్టర్లు బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తల కోసం ఆరాపడుతుంటారు. కానీ ఓ రిపోర్టర్ మాత్రం అందరికి భిన్నంగా తన వృతిని వదిలేసి.. మానవత్వం చాటుకున్నాడు.

వీడియో: రిపోర్టర్ సాహసం..మెచ్చుకోకుండా ఉండలేరు!

నేటికాలంలో చాలా మంది మనుషులు దారుణంగా  ఉన్నారు. మనిషి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే.. కాపాడేది పోయి.. ఫోన్లలో వీడియోలు తీసుకుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి..ట్రెండ్ చేస్తున్నారు. ఇలా కేవలం ఆ అంశాలపై చర్చలు జరిగేలా చేస్తున్నారే తప్ప..కష్టాల్లో ఉన్నవారికి సాయం చేద్దామనే కనీసపు ఆలోచన లేదు. ఏదైనా విపత్తు జరిగిన సమయంలో కాపాడాల్సినది మానేసి..వీడియోలు, రీల్స్ చేస్తూ..వింత ప్రపంచంలో బతుకుతున్నారు. అయితే ఓ రిపోర్ట్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓవరాక్షన్ పక్కన పెట్టి..ఆపదలో ఉన్న ఓ మహిళను..తన ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి..దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అమెరికాలోని అట్లాంటాలో హెలెన్ హరికేన్ తుఫాన్  విజృంభిస్తోంది. ఈ తుఫాన్  దెబ్బకు స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వరద బీభత్సాన్ని రిపోర్ట్ చేసేందుకు ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ తెల్లవారుజామున విధులకు వెళ్లాడు. వరద నీళ్లతో అనేక ప్రాంతాలు చిక్కుకున్నాయి. ఇక హరికెన్ తుఫాన్ వరదలు చేసిన విధ్వంసంపై రిపోర్టింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో అతడు ఉన్న ప్రాంతానికి సమీపంలో సాయం కోరుతూ ఓ మహిళ కేకలు వేసింది. ఆ మహిళ కేకలు విన్న రిపోర్టర్ బాబ్ వ్యాన్ డిల్లేన్ వెంటనే మానవత్వంతో స్పందించాడు.

రిపోర్టింగ్ ఆపేసి ఆమె ప్రాణాలను కాపాడేందుకు సిద్దమయ్యాడు. దాదాపు పీకల లోతు నీళ్లలో ఉన్న ఆమె కారు వద్దకు వెళ్లాడు. కారులో చిక్కుకున్న ఆమెను తన చేతుల్లోకి తీసుకుని వరద నీట నుంచి బయటపడేశాడు. ఆమె కారులో ఉండగా..పీకల్లోతుకు నీరు వచ్చాయి. అయితే రిపోర్టర్ కారు విండో తీయమని ఆమెకు చెప్పాడు. కారు నీళ్లలో మునిగిపోయినప్పటికీ  కారులోని ఎలక్ట్రికల్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంది. దీంతో విండో ఓపెన్ అయింది. సదరు రిపోర్టర్ ఆమెను కారులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. తన వీపుపై బాధితురాలిని ఎక్కించుకుని వరద నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి ఆమెను చేర్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఇక ప్రాణాలకు తెగించి మహిళను కాపిడిన రిపోర్టర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. రిపోర్టింగ్ చేస్తూ కెమెరా ఆమె వైపు చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ కోసం ఓవరాక్షన్ చేయలేదు ఈ రిపోర్టర్. వరదల్లో మహిళ మునిగిపోతున్న ఎక్స్ క్లూజివ్ విజువల్స్ అని పైత్యపు పోకడలకు పోకుండా మానవత్వంతో స్పందించడు. దీంతో రిపోర్టర్ బాబ్ వ్యాన్ డిల్లేన్ ను అందరు అభినందింస్తున్నారు. మిగిలిన మీడియా రిపోర్టర్లంతా న్యూస్ కోసం పాకులాడకుండా ఇలా సాయం చేయాలని నెటిజన్లు హితవు పలికారు.