iDreamPost
android-app
ios-app

అధికారుల బదిలీకి సిఫార్సు చేసిన ఎన్నికల కమీషనర్

అధికారుల బదిలీకి సిఫార్సు చేసిన ఎన్నికల కమీషనర్

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆరు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమీషన్ ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించిందని వివరించారు.ఆరువారాల అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి షెడ్యూల్ ని ప్రకటిస్తామని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు.

కాగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు, చిత్తూరులో జరిగిన హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫార్సు చేశారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఆదేశించారు. ఘర్షణలు నెలకొన్న మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని కమీషనర్ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా మహిళలు, బలహీనవర్గాలపై జరిగిన దాడులు అత్యంత శోచనీయమని పేర్కొన్నారు.