Keerthi
ఫోన్ పే యాప్ వినియోగదారులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇక నుంచి ఆ యాప్ లో బంగారం కొనుగోలు చేస్తే రూ.2000 వరకు cash back సౌకర్యం లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకి ఎప్పటి వరకు అంటే..
ఫోన్ పే యాప్ వినియోగదారులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇక నుంచి ఆ యాప్ లో బంగారం కొనుగోలు చేస్తే రూ.2000 వరకు cash back సౌకర్యం లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకి ఎప్పటి వరకు అంటే..
Keerthi
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన అంతా డిజిటల్ పేమెంట్స్ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే..చిన్న టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఏది కొనుగోలు చేసినా.. అంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రొసెస్ నే ఎక్కువగా అనుసరిస్తున్నారు. కాగా, ఇప్పటికే దేశంలో డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా.. కొత్త పేమెంట్ యాప్ లు అనేవి ఇప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి అందుబాటులో ఉన్నాయి.
కాగా, వీటిలో ఎక్కువగా Google Pay , Phone Pay వంటి ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ లకు ఎక్కువగా ప్రజాదరణ ఉందని చెప్పవచ్చు. పైగా వాటిలో కస్టమర్లను ఆకర్షించడానికి, చెల్లింపు యాప్‌లో క్యాష్ బ్యాక్ , డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా అమలవుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఫోన్ పే యాప్ వినియోగదారులకు ఓ తాజా శుభవార్త అందింది. ఇంతకి ఆ శుభవార్త ఏమిటంటే.. ఈ మే 10వ తేదీన జరిగిన అక్షయ తృతీయ నేపథ్యంలో.. బంగారం, వెండి తదితర ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేసిన వారి సంఖ్య ఎక్కువగానే ఉందన చెప్పవచ్చు. అయితే ఆ రోజు ఎవరైతే మీ అభరణాల కొనుగోలును ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి ఉంటే వారికి క్యాష్ బ్యాక్ సౌకర్యం కల్పించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చారు.
ఒకవేళ మీరు కనుక 24k డిజిటల్ బంగారం కొనుగోలు చేసి దానికి ఫోన్ పే ద్వారా డబ్బులను చెల్లించినట్లయితే మీకు 2000 రూపాయల క్యాష్ బ్యాక్ సౌకర్యం లభిస్తుంది. కానీ, ప్రతి కొనుగోలుపై ఈ ఆఫర్ అనేది ఉండదు. కేవలం మీరు ఈ అవకాశాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు . ఈ నేపథ్యంలోనే క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. అయితే డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బును డిపాజిట్ చేసిన తర్వాతే.. మీకు క్యాష్‌బ్యాక్ సౌకర్యం లభిస్తుందని చెప్పవచ్చు.
అయితే ఈ డిజిటల్ బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలంటే.. మీరు షాపుకు వెళ్లి బంగారం కొనుగోలు చేయకుండా.. భవిష్యత్తులో బంగారం కొనాలనే ఉద్దేశ్యంతో పెట్టుబడి పెట్టవచ్చని చెప్పవచ్చు. అందుకోసం అక్షయ తృతీయ నుంచి మే 14 వరకు ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.2000 వరకు cash back సౌకర్యం లభిస్తుంది.అలాగే బంగారం ధర పెరిగినప్పుడు మనం పెట్టిన పెట్టుబడిని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ పే కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా, భద్రత దృష్ట్యా, ప్రభుత్వం, RBI చెల్లింపు యాప్‌పై అనేక నిబంధనలను విధించాయ. అలాగే ఈ పద్ధతి చాలా మందికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.