iDreamPost
iDreamPost
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త రెండు నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. అయితే దర్శకుడు కానీ యూనిట్ కానీ ఎవరూ దీని గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. సరైన సందర్భం చూసి రివీల్ చేద్దామనుకున్నారు కానీ ఈ లోగా ఆ వార్త కాస్తా మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టింది. తాజాగా తమన్ ఓ నేషనల్ ఛానల్ తో మాట్లాడుతూ చిరు సల్మాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కలిసి డాన్స్ చేసే ట్యూన్ గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో బ్రిట్నీ స్పియర్స్ లాంటి అంతర్జాతీయ గాయనితో పాడించే ప్రయత్నం చేస్తున్నామని ఓపెన్ గా చెప్పేశాడు. సో ఇప్పుడు అన్ని డౌట్లు తొలగినట్టే.
లూసిఫర్ లో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు కం సెకండ్ హీరో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ నే సల్మాన్ చేయబోతున్నాడు. ఇది చివరి అరగంటలో మాత్రమే వస్తుంది. ఆ ఎపిసోడ్ చాలా కీలకం. చాలా ఛాయస్ లు పెట్టుకుని ఫైనల్ గా కండల వీరుడిని ఒప్పించడంలో చిరు టీమ్ సక్సెస్ అయ్యింది. దీని వల్ల ఇప్పుడు గాడ్ ఫాదర్ కి పాన్ ఇండియా అప్పీల్ వచ్చేస్తుంది. చేసింది చిన్న పాత్రే అయినా సల్మాన్ ఉన్నాడంటే చాలు నార్త్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. హిందీలో డబ్బింగ్ చేస్తారు కాబట్టి రీచ్ ఎక్కువగా ఉంటుంది. మెగా ఫ్యామిలీతో బాండింగ్ ఉన్న దృష్ట్యా సల్మాన్ ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది.
సల్మాన్ మొత్తం మూడు క్యామియోలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. త్వరలో విడుదల కానున్న అంతిమ్ లో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. షారుఖ్ ఖాన్ పఠాన్ లోనూ చెప్పుకోదగ్గ లెన్త్ ఉంటుందట. ఇవి కాకుండా గాడ్ ఫాదర్ ఒకటి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ ని సల్మాన్ సెంటిమెంట్ ని అనుసరించి 2022 రంజాన్ పండగకు రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. ఇంకా షూటింగ్ చాలానే ఉన్నప్పటికీ కథ దృష్ట్యా భారీ లొకేషన్లు, గ్రాఫిక్స్ అవసరం లేకపోవడంతో టార్గెట్ రీచ్ కావడం సులభమే. ఒక వేళ అదే జరిగితే ఆరు నెలల గ్యాప్ లో చిరంజీవి రెండు సినిమాలు వచ్చేసినట్టే
Also Read : Khiladi : ముగ్గురి మధ్య రసవత్తరమైన పోటీ