iDreamPost
iDreamPost
2022 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని ట్విస్టులు రాబోతున్నాయో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ ల క్లాష్ తో పోటీ రంజుగా ఉండగా ఆచార్య కూడా రావొచ్చనే ప్రచారం గత నెల రోజులుగా జోరుగా సాగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్ఆర్ఆర్ కూడా రేస్ లో దిగాలని ఆలోచనలో ఉన్నట్టుగా లీకులు వదులుతూనే ఉన్నారు. కానీ ఏ విషయమూ కన్ఫర్మ్ చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా అజిత్ వలిమై కూడా బరిలో దిగనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్లలో కలకలం రేగింది. ముందు దీపావళి అనుకున్నారు కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉండటంతో వాయిదా వేశారు.
వలిమై రావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ పాన్ ఇండియా రిలీజులకు కర్ణాటక, తమిళనాడు, కేరళలో గట్టి పోటీ ఇస్తుంది. స్క్రీన్ కౌంట్ విషయంలో కూడా తేడాలు వస్తాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ పోటీకి సై అంటే రెవిన్యూ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అజిత్ కు ఓవర్సీస్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. పైగా నిర్మాత బోనీ కపూర్ కావడంతో విదేశాల్లో, ఇక్కడ నార్త్ లో నెట్ వర్క్ ని బాగా మేనేజ్ చేస్తారు. ఇవన్నీ అలోచించి చూస్తే వలిమై వస్తే చిక్కు ఏదైనా ఉంటే అది ఒక్క ఆర్ఆర్ఆర్ కు మాత్రమే. మరి రాధే శ్యామ్ పరిస్థితి ఏంటనే అనుమానం అక్కర్లేదు. దీని కేసు పూర్తిగా వేరు అవుతుంది.
రాధే శ్యామ్ కు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంది. హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ టి సిరీస్ కాబట్టి థియేటర్లను గట్టిగా నిలబెట్టుకుంటారు. వలిమై ఎంత పెద్ద బడ్జెట్ లో నిర్మించినా ప్రభాస్ తో పోల్చుకుంటే నార్త్ సర్కిల్స్ లో అజిత్ అంత ఎఫెక్ట్ చూపించలేకపోవచ్చు. కానీ ఇంకో కోణంలో చూసుకుంటే రాధే శ్యామ్ కు తమిళనాడు మార్కెట్ మీద దెబ్బ పడుతుంది. అజిత్, విజయ్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు వందల థియేటర్లు హౌస్ ఫుల్ చేయించే అరవ జనాలు మన రాధే శ్యామ్ ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. చూస్తుంటే ఇదంతా ఏదో థ్రిలర్ సినిమా తరహాలో ఫైనల్ గా ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో అంతు చిక్కడం లేదు
Also Read : చేతులు కలిపిన ఎంటర్ టైన్మెంట్ దిగ్గజాలు