iDreamPost
android-app
ios-app

Pongal Movies: రామ్ చరణ్ Vs అజిత్.. పొంగల్ ఫైట్ మళ్ళీ టఫ్ అయిందిగా!

  • Published Nov 29, 2024 | 4:35 PM Updated Updated Nov 29, 2024 | 4:35 PM

Pongal Movies: ఈసారి పొంగల్ కి సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదనే చెప్పాలి. ఈసారి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Pongal Movies: ఈసారి పొంగల్ కి సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదనే చెప్పాలి. ఈసారి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Pongal Movies: రామ్ చరణ్ Vs అజిత్..  పొంగల్ ఫైట్ మళ్ళీ టఫ్ అయిందిగా!

పొంగల్ అంటేనే.. సినిమాల సీజన్. సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాలలో కచ్చితంగా మంచి వైబ్ ఉంటుంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుదల అయినా సరే.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసుకున్నాయి. జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే మైత్రీ మూవీస్ బ్యానర్లో తమిళ స్టార్ హీరో ‘తలా’ అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా పొంగల్ రేసులో ఉందని అన్నారు. దీంతో ఈ సినిమా గేమ్ చేంజర్ కి గట్టి పోటీ ఇస్తుందని భావించారు. కానీ ఈ సినిమా వాయిదా పడింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే తలా నటించిన మరో సినిమా మాత్రం సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ మళ్ళీ ఖుషి అవుతున్నారు.

అజిత్ విదాముయార్చి సినిమా టీజర్‌ను నేడు మూవీ యూనిట్ రిలీజ్ చేసి.. సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేసింది. ఈ టీజర్ అజిత్ ఫ్యాన్స్ ని ఊపేస్తుందనే చెప్పాలి. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే తెలుగులో ఏమో కానీ తమిళ్‌లో మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్‌కు ఈ సినిమా నుంచి గట్టి పోటీ తప్పదు. రామ్ చరణ్, శంకర్ క్రేజ్‌తో తమిళ్‌లో భారీ ఎత్తున గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. కానీ తమిళ్ లో అజిత్‌తో పోటీ అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. తమిళ్‌లో తలా ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అజిత్ సినిమాలకు ఓపెనింగ్స్ తోనే సగం లాభాలు తీసుకొస్తారు.అలాంటి విదాముయార్చిని తట్టుకొని గేమ్ ఛేంజర్‌ ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అలా అని గేమ్ చేంజర్ తక్కువేమీ కాదు.

తెలుగులో గేమ్ చేంజర్ పోటీని తట్టుకోవడం కూడా విదాముయార్చీకి కష్టమే. ఎందుకంటే తెలుగులో రామ్ చరణ్ కి మామూలు క్రేజ్ లేదు. గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ థియేటర్లు తగల బెట్టడం పక్కా. కానీ కంటెంట్ క్వాలిటీగా ఉంటే ఏ సినిమా అయినా కింగే. పోటీ ఉన్నా లేకున్నా ఆడేస్తాయి. అది ప్రతి సంక్రాంతికి కూడా ప్రూవ్ అవుతుంది. మరి చూడాలి ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారు అనేది. ఏదేమైనా ఈసారి పొంగల్ ఫైట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందనే చెప్పాలి.