iDreamPost
android-app
ios-app

సంక్రాంతి రేసు నుంచి అజిత్ తప్పుకోవడం.. చరణ్ కు ప్లస్ అవుతుందా!

  • Published Nov 25, 2024 | 5:18 PM Updated Updated Nov 25, 2024 | 5:18 PM

Ajith Good bad ugly Movie: సంక్రాంతి సీజన్ కోసం కొన్ని నెలల ముందు నుంచే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ పోటీ పడుతూ ఉంటారు. ఆ డేట్స్ కోసం కొన్ని మంత్స్ ముందు నుంచి కర్చీఫ్ వేసుకుంటారు.అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే అనే టాక్ వినిపిస్తుంది.

Ajith Good bad ugly Movie: సంక్రాంతి సీజన్ కోసం కొన్ని నెలల ముందు నుంచే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ పోటీ పడుతూ ఉంటారు. ఆ డేట్స్ కోసం కొన్ని మంత్స్ ముందు నుంచి కర్చీఫ్ వేసుకుంటారు.అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే అనే టాక్ వినిపిస్తుంది.

  • Published Nov 25, 2024 | 5:18 PMUpdated Nov 25, 2024 | 5:18 PM
సంక్రాంతి రేసు నుంచి అజిత్ తప్పుకోవడం.. చరణ్ కు ప్లస్ అవుతుందా!

సంక్రాంతి సీజన్ కోసం కొన్ని నెలల ముందు నుంచే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలనీ పోటీ పడుతూ ఉంటారు. ఆ డేట్స్ కోసం కొన్ని మంత్స్ ముందు నుంచి కర్చీఫ్ వేసుకుంటారు. ఈ క్రమంలో 2025 సంక్రాంతికి చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ , వెంకీ సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చేస్తున్నారు. వీటితో పాటు మరొక రెండు మూడు సినిమాలు కూడా రేసులో పాల్గొంటున్నట్లు టాక్ వినిపించింది. వాటిలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి. కానీ ఇప్పుడు ఈ మూవీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే అనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ లో ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. నిర్మాతను ఈ సినిమా గురించి ప్రశ్నించగా.. పొంగల్ రిలీజ్ అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉందని.. బెస్ట్ ఇవ్వడానికి టీం పని చేస్తుందని… సో కచ్చితంగా సీజన్ కు వస్తామనే గ్యారెంటీ లేదని చెప్పారు. సో ఇలా మూవీ టీం చెప్పి చెప్పనట్లుగా సంక్రాంతికి రావడం కష్టమని చెప్పేసింది.

ఇదంతా మూవీ టీం కు సంబంధించిన విషయం. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు అజిత్ తప్పుకోవడం మెయిన్ గా చరణ్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే అసలే చరణ్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియనిది కాదు. పైగా ఇది సీనియర్ హీరోల మధ్య పోటీగా రిలీజ్ అవుతుంది. సో ఏదైనా ఒక సినిమా తగ్గినా కూడా కాస్త కలిసి వస్తుందని చెప్పి తీరాల్సిందే. పైగా గేమ్ చెంజర్ తమిళ వెర్షన్ కు రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు.. డైరెక్టర్ శంకర్ బ్రాండ్ మీద కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. సో అజిత్ పోటీ ఉంటె కచ్చితంగా థియేటర్స్ సమస్య వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి.. అక్కడ చరణ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. పైగా ఎస్జె సూర్య, జయరాం, కియారా లాంటి స్టార్ క్యాస్టింగ్ ఎక్కడో కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. సో ఈ లెక్కన అజిత్ డ్రాప్ అవ్వడం గేమ్ ఛేంజర్ కు బెనిఫిట్ అని చెప్పి తీరాల్సిందే.

ఇక ఇక్కడ విషయానికొస్తే.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నిర్మాతలు మైత్రి వారే కాబట్టి.. భారీ రేంజ్ లో కాకపోయినా వీలైనన్ని వచ్చేలా చూసుకుంటారు. ఇక ఇప్పుడు రేస్ నుంచి అవుట్ అయింది కాబట్టి.. వాటిని చరణ్, వెంకీ , బాలయ్య పంచుకునే అవకాశం ఉంది. ఎంత లేదన్నా ఒక సినిమాకు కొన్ని షోస్ పెరిగినా కూడా భారీ రేంజ్ లో గ్రాస్ పెరుగుతుంది. కాబట్టి దానిని ఓ చిన్న విషయంగా కొట్టి పడేసే అవకాశం లేదు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ పోస్ట్ పోన్ అని డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా.. ఇండైరెక్ట్ గా ఇచ్చిన హింట్ మాత్రం ఇదే. అయితే ఈ ప్లేస్ లో అజిత్ మరో మూవీ విదాముయార్చి కూడా రిలీజ్ కు రెడీ ఉంది. ఒకవేళ అది వచ్చినా కానీ అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే తెలుగులో ఈ సినిమాను అంత క్రేజ్ ఏమి లేదు. ఇక రిలీజ్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.