iDreamPost
android-app
ios-app

Prashanth Neel: ప్రభాస్‌- జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు షాక్‌ ఇవ్వనున్న ప్రశాంత్‌ నీల్‌!

ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేయబోతున్నాడు. ఒకటి సలార్‌ 2 కాగా.. మరోటి జూనియర్‌ ఎన్టీఆర్‌తో. ఈ రెండు సినిమాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో క్లారిటీ లేదు.

ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేయబోతున్నాడు. ఒకటి సలార్‌ 2 కాగా.. మరోటి జూనియర్‌ ఎన్టీఆర్‌తో. ఈ రెండు సినిమాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో క్లారిటీ లేదు.

Prashanth Neel: ప్రభాస్‌- జూ.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు షాక్‌ ఇవ్వనున్న ప్రశాంత్‌ నీల్‌!

సలార్‌ సాధించిన విజయంతో ప్రశాంత్‌ నీల్‌ పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రభాస్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు 600 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మంచి వసూళ్లతో థియేటర్లలో దూసుకుపోతోంది. సలార్‌ సాధించిన విజయంతో ప్రశాంత్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేయటం అయిపోయిన తర్వాత సలార్‌ 2 కోసం రంగంలోకి దిగుతారన్న టాక్‌ నడిచింది.

సలార్‌ 2 తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుందన్న ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంతో ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే.. సలార్‌ 2, జూనియర్‌ ఎన్టీఆర్‌ 31 కంటే ముందు ప్రశాంత్‌ ఓ తమిళ స్టార్‌ హీరోతో మూవీ చేయబోతున్నారట. ఆ హీరో సినిమా అయిపోయిన తర్వాతే మిగిలిన రెండు చిత్రాల షూటింగ్‌ మొదలవ్వనుందని ప్రచారం నడుస్తోంది.

ఆ హీరో ఎవరో కాదు.. తమిళ స్టార్‌ హీరో తల అజిత్‌. ప్రశాంత్‌ నీల్‌ తర్వాతి సినిమా ఈయనతోనే తీయబోతున్నారట. హోంబలే ఫిల్మ్స్‌ వీరిద్దని కాంబినేషన్‌ను సెట్‌ చేసిందట. ఇప్పుడు ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఈ ప్రచారంతో ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఒకింత నిరాశకు గురవుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్‌ అయి ఉన్నాడు.

వాటిలో కేజీఎఫ్‌ 3, సలార్‌ 2, జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాలపై అధికారిక ప్రకటన కూడా ఉంది. ప్రశాంత్‌ నీల్‌ .. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కూడా మూవీ చేయబోతున్నారట. వీటన్నిటినీ కాదని, అజిత్‌ సినిమా తీసే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అజిత్‌తో సినిమా చేయాలంటే.. లైన్‌లో ఉన్న చిత్రాలు ముగించుకుని వెళ్లే సరికి 4 నుంచి 5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి, ప్రశాంత్‌ నీల్‌- తల అజిత్‌తో సినిమా చేయబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetandyou girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis