iDreamPost
android-app
ios-app

Vijay: అజిత్ డైరెక్టర్ తో విజయ్ సినిమా?

  • Published Apr 01, 2024 | 12:25 PM Updated Updated Apr 01, 2024 | 12:29 PM

దళపతి విజయ్ తదుపరి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు?దాంతో త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని విజయ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

దళపతి విజయ్ తదుపరి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు?దాంతో త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని విజయ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

  • Published Apr 01, 2024 | 12:25 PMUpdated Apr 01, 2024 | 12:29 PM
Vijay: అజిత్ డైరెక్టర్ తో విజయ్ సినిమా?

దళపతి విజయ్ తదుపరి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యంత చర్చనీయాంశమైన ప్రశ్నలలో ఒకటి. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఎందుకంటే విజయ్ 69వ చిత్రం నటుడిగా ఆయన కెరీర్‌లో చివరి చిత్రంగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే ఈ స్టార్ హీరో పొలిటికల్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత వెంకట్ ప్రభు దర్శకత్వంలో గొట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో విజయ్ నటిస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకుడిగా అజిత్ తో ఎక్కువ సినిమాలు తీశారు. తునివు, వాలిమై, అంతకు ముందు నేర్కొండ పార్వై సినిమాకి ఆయన అజిత్ తో పని చేశారు. ఇప్పుడు విజయ్ తో సినిమా అన్న వార్త విని అజిత్ దర్శకుడితో విజయ్ సినిమా చేస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కాగా దర్శకుడు హెచ్.వినోద్ స్క్రిప్ట్‌ను విజయ్ ఆమోదించినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని, 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఒక ఊపును అందించగలదని భావిస్తున్నారు. గత సంవత్సరం, విజయ్‌కి కొన్ని స్క్రిప్ట్‌లను వివరించినట్లు వినోద్ ధృవీకరించారు. “ఆయనతో పొలిటికల్ సినిమా తీయాలని ఉంది. అదే నా కోరిక. నేను ఆయనకు చెప్పిన అన్ని స్క్రిప్ట్‌లలో రాజకీయ కోణం ఉంటుంది” అని వినోద్ గతంలో చెప్పారు. ఇంతకు ముందు, విజయ్ తన 69వ చిత్రం కోసం తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్‌తో కలిసి పని చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, వెట్రిమారన్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఇంకా విజయ్ తో సినిమా ఖరారు కాలేదని చెప్పేశారు. అలాగే యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం లైన్ లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. జిగర్తాండ డబుల్‌ఎక్స్ విడుదల సమయంలో, తాను విజయ్‌తో చర్చలు జరుపుతున్నట్లు కార్తీక్ వెల్లడించారు.

దాంతో త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని విజయ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అందరి ఊహలకు భిన్నంగా కార్తీక్ తాజాగా మరో స్టార్ హీరో సూర్యతో కొత్త సినిమాని ప్రకటించారు. ఇక హెచ్ వినోద్ విషయానికి వస్తే కమల్ హాసన్‌ తో ఒక పొలిటికల్ డ్రామాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్‌ చేయడానికి కమల్ వెళ్లడంతో, వినోద్ ఇప్పుడు విజయ్ వద్దకు చేరాల్సి వచ్చింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş