iDreamPost
iDreamPost
దీపక్ రెడ్డి అనే కుర్రాడు తీసిన “మనసా నమహ” అనే షార్ట్ ఫిలిం అందరి మనసుల్నీ దోచుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇప్పటి వరకూ 513 అవార్డులు వరించాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ గా “మనసా నమహ”ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు గిన్నిస్ సర్టిఫికెట్ ను దీపక్ రెడ్డికి అందజేయగా.. ఆ ఫొటోను దీపక్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది చూసిన ప్రముఖులు.. దీపక్ రెడ్డిని అభినందిస్తున్నారు. నటుడు అడివి శేష్, దర్శకుడు సుకుమార్ కూడా దీపక్ రెడ్డిని అభినందించారు. “నీవు ఫీచర్ ఫిల్మ్ తో ప్రపంచాన్ని షేక్ చేసే వరకు నేను వేచి చూడలేకపోతున్నాను” అని అడివిశేష్ పేర్కొన్నారు. ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం అంత సాధారణ విషయమేమీ కాదు. కాగా.. “మనసా నమహ” రొమాంటిక్ కామెడీ షార్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో సూర్య గా విరాజ్ అశ్విన్, చైత్రగా ద్రిషిక చందర్, పృథ్వీ శర్మ, శ్రీవల్లి రాఘవేందర్ తదితరులు నటించారు.
Whoa!#Telugu short film #Manasanamaha is now the holder of the #GuinnessWorldRecord for the most awards won by a short film!
Manasanamaha had won 513 awards at last count
Super Congratulations to its creator #DeepakReddy for the achievement!@deepuzoomout @GWR pic.twitter.com/wcMuNixBhu
— BINGED (@Binged_) June 27, 2022