iDreamPost
android-app
ios-app

‘పుష్ప-2’ నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌! ఫ్యాన్స్‌ భారీ సర్‌ప్రైజ్‌

  • Published Sep 19, 2024 | 12:15 PM Updated Updated Sep 19, 2024 | 12:15 PM

Puspa-2: డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పుష్ప 2 మూవీపై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్స్ లో చూద్దమా, ఏ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందానని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

Puspa-2: డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పుష్ప 2 మూవీపై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్స్ లో చూద్దమా, ఏ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందానని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

  • Published Sep 19, 2024 | 12:15 PMUpdated Sep 19, 2024 | 12:15 PM
‘పుష్ప-2’ నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌! ఫ్యాన్స్‌ భారీ సర్‌ప్రైజ్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప-2’. కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసిన పుష్ప ఫీవర్ కొనసాగింది.  దీంతో ఇప్పుడు పుష్ప 2 మూవీ పై కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత ఫుల్ బజ్ ఉన్న మూవీ పుష్ప2 అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప 2 మూవీ గురించి లేటేస్ట్ అప్డేట్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమైపోతున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్.. మూవీపై మరింత హైపును పెంచేసింది. పైగా అందులో బన్ని ఇది వరకు ఎన్నడూ కనిపించని గెటప్లో కనిపిస్తూ ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించాడనే చెప్పవచ్చు. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందానని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 మూవీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అదేమిటంటే.. ప్రస్తుతం పుష్ప 2 మూవీ ఫస్టాఫ్ వర్క్ పూర్తవ్వగా.. సెకండాఫ్ మూవీ షూటింగ్ దశలో ఉందట. అయితే ఆ షూటింగ్ కూడా ఈ అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.

అంతేకాకుండా.. పుష్ప 2 సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. కానీ, అందులో జాతర పాట మాత్రం నేరుగా థియేటర్లలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే థియేటర్స్ లో సాంగ్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ఇవ్వడం సుకుమార్ కు కొత్తేమీ కాాదు. ఎందుకంటే.. గతంలో  రామ్ చరణ్ రంగస్థలం మూవీలో కూడా ఓరయ్యో అనే ఎమోషనల్ సాంగ్ ను సుకుమార్ డైరెక్ట్ గా  థియేటర్స్ లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి, ఇప్పుడు కూడా సుకుమార్ అదే ట్రెండ్ ఫాలో అయితే ఈసారి బన్ని ఫ్యాన్స్ కూడా థియేటర్స్ లో అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని చెప్పవచ్చు. కానీ, ఈ విషయం పై ఇప్పటి వరకు  మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే.. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై తెరకెక్కింస్తుండగా, ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే పుష్ప 2 మూవీ  ఈ డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మరోసారి పుష్ప 2 మూవీతో బన్ని నేషనల్ అవార్డు గెలుచుకోవడం పక్క అని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి, ప్రస్తుతం పుష్ప 2 మూవీలోని జాతర సాంగ్ డైరెక్ట్ గా  థియేటర్స్ లో విడుదల కాబోతుందనే టాక్ వైరల్ అవుతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş