iDreamPost
android-app
ios-app

పుష్ప 2 కౌంట్ డౌన్ షురూ.. ఇప్పుడు సీన్ లోకి పుష్ప-3.. ?

  • Published Oct 18, 2024 | 3:25 PM Updated Updated Oct 18, 2024 | 3:25 PM

Pushpa-3 Movie: అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పుష్ప 3 గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Pushpa-3 Movie: అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పుష్ప 3 గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 18, 2024 | 3:25 PMUpdated Oct 18, 2024 | 3:25 PM
పుష్ప 2 కౌంట్ డౌన్ షురూ..  ఇప్పుడు సీన్ లోకి పుష్ప-3.. ?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రానున్న పుష్ప-2 సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. బన్నీ ఆర్మీ అంతా పుష్ప -2 జాతర కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. ఇప్పుడు వరుస అప్డేట్స్ రిలీజ్ చేయడం, గ్రాండ్ గా మూవీ ప్రమోషన్స్ చేయడం పైనే.. మూవీ టీం ఫోకస్ పెడుతుంది. ప్రమోషన్స్ కోసం పాన్ ఇండియా స్టార్స్ నే రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఇంకా కొద్దీ రోజుల్లో బన్నీ అన్ని లెక్కలు తేల్చేస్తాడు. సో అభిమానులంతా ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని వెంటనే అలెర్ట్ అవుతున్నారు. పుష్ప సినిమా కాబట్టి మూవీ రిలీజ్ కాకముందే ఈ మాత్రం హైప్ ఉండడంలో విశేషం ఏమి లేదు. కానీ ఇప్పుడు పుష్ప-2 రిజల్ట్ ఏంటో తెలియకముందే.. సీన్ లోకి పుష్ప-3 ఎంటర్ అయింది.

పుష్ప మొదటి పార్ట్ వచ్చి మూడేళ్లు అయింది. అయినా సరే ఎక్కడా కూడా ఈ జోరు తగ్గలేదు. ఈ క్రమంలో 2వ పార్ట్ కూడా దాదాపు అయిపోయింది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ, అప్పుడే సుకుమార్ పుష్ప-3 కి శ్రీకారం చుట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ మూవీ కథను.. రెండో పార్ట్ తోనే ముగించబోతున్నారు. మూడవ పార్ట్ లో మాత్రం మొదటి పార్ట్ లోని పాత్రలతో.. కొత్త కథను క్రియేట్ చెయనున్నాడట దర్శకుడు. ఇప్పుడు ఈ మ్యాటర్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైగా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలిపిన పుష్ప నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉంటాయట. పుష్ప 3 తో ఆగిపోకుండా.. ఈ ఫ్రాంచైజీ నుంచి వరుస సినిమాలు చేయాలనీ సుకుమార్, అల్లు అర్జున్ భావిస్తున్నారట. అది కూడా పుష్ప పాత్ర చుట్టూ కథలు అల్లుతూ సినిమాలు చేస్తూ.. ఈ ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కనీసం నాలుగేళ్లకు ఓసారి ఈ మూవీని తీసుకురావాలని అనుకుంటున్నారట. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ వర్క్ అవుట్ అయితే మాత్రం.. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో ఇదే బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ అవుతుంది.

ఇక పుష్ప-2 సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి . ఒకే దర్శకుడితో మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తుంటాడు బన్నీ.. సో మరోసారి ఈ కాంబినేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సో పుష్ప ఫ్రాంచైజీలో కూడా అదే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఏమౌతుందో చూడాలి. అలాగే పుష్ప-2 అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకుంటుందో లేదో అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom