iDreamPost
android-app
ios-app

ఇంజినీరింగ్ కుర్రాడి ఘనత.. ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మిషన్.. గిన్నీస్ రికార్డుల్లోకి

  • Published Oct 17, 2024 | 12:55 PM Updated Updated Oct 17, 2024 | 12:55 PM

Washing Machine: ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషింగ్ మిషన్ ను రూపొందించి రికార్డ్ క్రియేట్ చేశాడు భారతీయ ఇంజనీర్ కుర్రాడు. అరచేతిలో పట్టే వాషింగ్ మిషన్ ను రూపొందించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

Washing Machine: ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషింగ్ మిషన్ ను రూపొందించి రికార్డ్ క్రియేట్ చేశాడు భారతీయ ఇంజనీర్ కుర్రాడు. అరచేతిలో పట్టే వాషింగ్ మిషన్ ను రూపొందించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇంజినీరింగ్ కుర్రాడి ఘనత.. ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మిషన్.. గిన్నీస్ రికార్డుల్లోకి

టెక్నాలజీ డెవలప్ మెంట్ తో వినూత్నమైన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞనాన్ని యూజ్ చేసుకుని కొత్త కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. ఊహకందని రీతిలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సరికొత్త ఆవిష్కరణలతో తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు యువత. మానవాళికి ఉపయోగపడే పరికరాలను రూపొందిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే రీతిలో భారతీయ ఇంజినీరింగ్ కుర్రాడు తన ప్రతిభతో అద్భుతం చేశాడు. అరచేతిలో పట్టే వాషింగ్ మిషన్ ను రూపొందించి హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషిన్ ను తయారు చేసి గిన్నీస్ రికార్డ్ నెలకొల్పాడు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదంటూ నిరూపించాడు.

అతిచిన్న వాషింగ్ మిషన్ ను సృష్టించి టెక్నాలజీకి సవాల్ విసురుతున్నాడు. అతడే భారత్ కు చెందిన సెబిన్ సాజీ. మినీ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. 3, 5 ,7 కేజీ కెపాసిటీ గల వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో దాదాపు అందరిళ్లలో దర్శనమిస్తున్నాయి. బట్టలు ఉతికేంత తీరక లేక వాషింగ్ మిషన్స్ పై ఆధారపడుతున్నారు. అయితే అరచేతిలో పట్టే వాషింగ్ మిషన్ మాత్రం లేదు. ఇప్పుడు సెబిన్ సాజీ ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించి రికార్డ్ సృష్టించాడు. అతని ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇది మామూలు వాషింగ్ మిషన్ మాదిరిగానే పని చేస్తుంది. దీని కొలతలు వరుసగా 1.28 1.32, 1.52 అంగుళాలు మాత్రమే ఉంటుంది.

ఇది 0.65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. ఈ సూక్ష్మ వాషింగ్ మెషీన్ గిన్నిస్ రికార్డు సాధించింది. సాజీ దానిని డిజైన్, అసెంబుల్ చేసి ఆపై అది పనిచేస్తున్నట్టు ప్రదర్శించి చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ సూక్ష్మ వాషింగ్ మిషన్ లో వాష్, రిన్స్, స్పిన్ వంటి అన్ని ఫంక్షన్లు పనిచేస్తున్నట్టు చూపించాడు. అతడు దానిని కొలిచేందుకు ప్రత్యేక డిజిటల్ కాలిపర్స్‌ను ఉపయోగించాడు. అతిచిన్న వాషింగ్ మిషన్ లో ఓ చిన్న క్లాత్ వేసి.. చిటికెడు వాషింగ్ పౌడర్ తీసుకుని నీరు పోసి ఆన్ చేయడం ఆ వీడియోలో కనిపించింది. క్లాత్ వాష్ చేస్తున్న మినీ వాషింగ్ మిషన్ ను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినూత్న పరికరాన్ని సృష్టించిన సెబిన్ సాజీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి వరల్డ్ లో అతిచిన్న వాషింగ్ మిషన్ ను రూపొందించిన సెబిన్ సాజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.