iDreamPost
android-app
ios-app

వరల్డ్ రికార్డ్ సృష్టించిన iphone.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

  • Published Sep 26, 2024 | 4:01 PM Updated Updated Sep 26, 2024 | 4:08 PM

iPhone 15 Pro Max: మనం వాడే ఫోన్లు 6 ఇంచెస్ ఉంటాయి. ట్యాబ్ విషయానికి వస్తే.. 7 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది.

iPhone 15 Pro Max: మనం వాడే ఫోన్లు 6 ఇంచెస్ ఉంటాయి. ట్యాబ్ విషయానికి వస్తే.. 7 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన iphone.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

మనమందరం కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటాము. స్మార్ట్ ఫోన్స్ సైజ్ విషయానికి వస్తే .. ఒకప్పుడు మనం వాడే ఫోన్లు 3 ఇంచెస్ ఉంటాయి. ఆ తరువాత సైజులని బట్టి పెరుగుతూ వచ్చాయి. 3 అంగుళాలతో స్టార్ట్ అయ్యి 6 అంగుళాల ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక ట్యాబ్ విషయానికి వస్తే.. 7 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది. మాక్సిమం మనం వాడే ఫోన్లు, ట్యాబులు అన్నీ కూడా ఈ సైజుల్లోనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా 6.74 అడుగుల ఫోన్ గురించి విన్నారా? అయితే తాజాగా అలాంటి ఫోన్ ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మెడియాలో సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ ఎత్తు సగటు మనిషి ఎత్తుకంటే ఎక్కువనే చెప్పాలి. ఇంతకీ ఈ ఫోన్ ఎక్కడుంది? దీన్ని ఎవరు తయారు చేశారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రిటీష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ని డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అరుణ్ డిజైన్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పేరు ఐఫోన్ 15 ప్రో మాక్స్. దీనిని 6.74 అడుగులతో డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ని అరుణ్ గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్‌ ‘మాథ్యూ పెర్క్స్’తో కలిసి డిజైన్ చేశాడు. ఈ స్మార్ట్ ఫోన్ వీడియోను అప్‌లోడ్ చేశారు. మనం ఈ వీడియోలో ఫోన్ కి సంబంధించిన విషయాలను పూర్తిగా చూడవచ్చు. ఈ వీడియోలో అరుణ్ గిన్నీస్ బుక్ అధికారులకు ఫోన్ డీటైల్స్ వివరించడం, దీన్ని ఆపరేట్ చేయడం చూపించారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు సాధారణ ఫోన్ ఫీచర్ల లాగా ఉన్నాయని గిన్నీస్ టీం మెంబర్ తెలిపారు. ఈ ఫోన్ స్క్రోల్ చేయడానికి సులభంగా ఉందని అన్నారు. అలాగే ఈ ఫోన్ మెసేజీలు, ఈమెయిల్స్ పంపడానికి అనుకూలంగా ఉందని అన్నారు. అంతేగాక దీనికి కెమెరా, ఫ్లాష్ లైట్, ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ భారీ ఐఫోన్ భారీ బ్యాటరీ కూడా కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ బరువు ఏకంగా 300 కేజీల పైగా ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్లో అరుణ్ గేమ్ కూడా ఆడుతున్నట్టు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ భారీ స్మార్ట్ ఫోన్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ భారీ ఐఫోన్ ఫోన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.