iDreamPost
android-app
ios-app

గడ్డాలు పెంచుకొని రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారంట

  • Published Jun 18, 2020 | 3:06 AM Updated Updated Jun 18, 2020 | 3:06 AM
గడ్డాలు పెంచుకొని రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారంట

శాసనమండలిలో మాట్లాడటానికి ఎటువంటి పాయింట్లు లేనపుడే పనికిమాలిన విషయాలపై టిడిపి మాట్లాడుతున్నట్లు, గోల చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే సభలో జరగాల్సిన పనేదో చూడకుండా మంత్రుల గడ్డాలపై టిడిపి సభ్యుడు నాగ జగదీశ్వర్ లేవనెత్తిన అంశమే నిదర్శనం. అనవసరంగా ఓ పనికిమాలిన అంశాన్ని లేవనెత్తి చివరకు మంత్రుల సమాధానంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయ్యింది.

అసలేమి జరిగిందంటే మండలిలో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉండగా అన్నింటినీ వదిలిపెట్టి టిడిపి సభ్యుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ ’గడ్డాలు పెంచుకుని మంత్రులు రౌడీల్లాగ ప్రవర్తిస్తున్నారం’టూ ఆరోపణలు చేశాడు. దాంతో సభలో పెద్ద గోల మొదలైంది. చివరకు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గడ్డాలున్న వాళ్ళంతా రౌడీలేనా ? అంటూ టిడిపిని నిలదీశాడు.

ఇదే విషయమై అనీల్ మాట్లాడుతూ శాసనమండలి ఛైర్మ ఎంఏ షరీఫ్ తో పాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కూడా గడ్డాలున్నాయని వాళ్ళు కూడా రౌడీలేనా అంటూ లాజిక్ లేవనెత్తాడు. దాంతో మళ్ళీ మరోసారి గొడవైంది. నిజానికి సభ్యులు గడ్డాలు పెంచుకుంటే ఏమిటి ? పెంచుకోకపోతే ఏమిటి ? ఏదో ఒక పనికిమాలిన అంశాన్ని లేవనెత్తటం, మంత్రులు, అధికారపార్టీ సభ్యులను రెచ్చగొట్టడం ద్వారా సభలో గోల చేయాలన్న ప్లాన్ తప్ప మరేమీ కనబడటం లేదు.

మంత్రుల గడ్డాలపై కావాలనే వ్యాఖ్యలు చేసిన టిడిపి సభ్యుడికి ఛైర్మన్ తో పాటు చంద్రబాబుకు కూడా గడ్డాలున్న విషయం గుర్తుకురాలేదా ? తాము మంత్రుల గడ్డంపై వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ఛైర్మన్, చంద్రబాబు గడ్దాలపై వ్యాఖ్యలు చేయరన్న చిన్న విషయం కూడా టిడిపికి తెలీదా ? తెలుసు, తెలిసినా కావాలనే మంత్రులను రెచ్చగొట్టింది. ఎందుకంటే సభలో మాట్లాడటానికి టిడిపి సభ్యుల దగ్గర విషయం ఏమీలేదు. అందుకనే లేనిపోని వ్యాఖ్యలు చేసి నభస సృష్టించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.