iDreamPost
android-app
ios-app

కరోనాపై పోరు: సుప్రిం జడ్జి విరాళం

కరోనాపై పోరు: సుప్రిం జడ్జి విరాళం

కరోనా వైరస్‌ నియంత్రణపై పోరులో ప్రభుత్వాలకు పారిశ్రమికవేత్తలు, సినీ స్టార్లు తమ వంతు మద్ధతు ఆర్థిక రూపంలో ఇస్తుండగా ఆ జాబితాలో న్యాయమూర్తులు చేరారు. సుప్రిం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నాయ్యమూర్తుల్లో తొలి అడుగువేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా ప్రధాన మంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌వీ రమణ తెలంగాణ, ఏపీలకు కూడా లక్ష రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు.

కరోనా పై పోరులో ప్రజలందరూ కలసి రావాలని ఎన్‌వీ రమణ పిలపునిచ్చారు. ప్రభుత్వాల ఆదేశాలు, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరారు. కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకు అందరూ మద్ధతు తెలపాలని ఆయన సూచించారు.

లాక్‌డౌన్‌ ప్రకటించినా భారత్‌లో కరోనా వ్యాప్తి ఆగడంలేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 300 లోపు ఉండగా.. ఆరు రోజుల్లో ఈ సంఖ్య రెండు రెట్లకు దగ్గరా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 873 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 20 మంది చనిపోగా, 79 మంది కోలుకున్నారు. తెలంగాణలో 59, ఏపీలో 13 కేసులు నమోదయ్యాయి.