iDreamPost
android-app
ios-app

పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు బ్రేక్

పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు బ్రేక్

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా పూరీ జగన్నాథ రథయాత్ర పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 23న పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రథయాత్ర నిర్వహించడం సబబు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో ఉధృతంగా వ్యాపిస్తుందని, రథయాత్ర నిర్వహిస్తే లక్షల మంది ప్రజలు రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని, ప్రజారోగ్యానికి ఇది మంచిది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే హర్షించడని సుప్రీంకోర్టు వెల్లడించింది. రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలు తక్షణమే ఆపేయాలని ఆదేశాలను జారీ చేస్తూ రథయాత్రను నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.