ఆస్పత్రిలో వసతులు నిల్.. తండ్రిని చేతుల్లో మోసుకెళ్లిన కొడుకు!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం ఎన్నో దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సీరియస్ గా ఉన్న రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో ఉండకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం ఎన్నో దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సీరియస్ గా ఉన్న రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో ఉండకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.

దేశంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్నో మెరుగైన వసతులు కల్పించాని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. అక్కడ జరుగుతున్న దారుణమైన పరిస్థితులు నిత్యం సోషల్ మీడియాలో వెలుగు చూస్తూనే ఉంటాయి. ఆస్పత్రి వ్యవస్థలోని లోపాలను కన్నులకు కట్టినట్టుగా సోషల్ మీడియాలో దృష్యాలు హృదయాలను కదిలిస్తుంటాయి. ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, రోగులను తీసుకువెళ్లేందుక స్ట్రెచర్, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండకపోవడం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి దారుణ ఘటనలపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో హృదయవిదారకమైన సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ దేహత్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాన్పూర్ దేహత్ కి చెందిన పుష్పేంద్ర తన తండ్రి శివాలిని ప్రభుత్వాసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తీసుకువచ్చాడు. ఆ సమయంలో బాధితుడికి హాస్పిటల్ వర్గాలు ఎవరూ సహాయం చేయలేదు. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు.. అందుబాటులో డాక్టర్ లేడు. చేసేదేమీ లేక పుష్పేంద్ర తన తండ్రిని ఒడిలోకి తీసుకొని అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఇతర రోగులు, ప్రజలు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను గట్టిగానే మందలించారు. ఎవరైనా పొరపాటు చేసినా.. ప్రజలు ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పుష్పుంద్ర ఘటనపై జిల్లాకు చెందిన వైద్యారోగ్య శాఖ అధికారి మాట్లేడేందుకు సిద్దంగా ఉండకపోవడం గమనార్హం. అధికార ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని.. కేవలం మందలించి వదిలి వేయడంతో సిబ్బంది పదే పదే ఇలాంటి తప్పులు చేస్తున్నారని.. ఈ ఘటనపై ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

Show comments