సీక్రెట్ మిషన్ లో NIA ఏజెంట్

By iDream Post Sep. 04, 2021, 02:30 pm IST
సీక్రెట్ మిషన్ లో NIA ఏజెంట్

ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ స్థాయి విజయం తనకు తర్వాత దక్కనప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది చావు కబురు చల్లగాతో గట్టి షాకే తిన్న ఈ యువ హీరో కొత్త మూవీ రాజా విక్రమార్క. ఈ టైటిల్ కి మెగా ఫ్యాన్స్ కి కనెక్షన్ ఉంది. ముప్పై ఏళ్ళ క్రితం 1990లో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా పేరు ఇది. అప్పట్లో ఇది పెద్దగా విజయం సాధించలేదు కానీ రాజ్ కోటి పాటలు మెగాస్టార్ స్టెప్పులు తర్వాతి కాలంలో దీన్నో వాచబుల్ క్యాటగరికి మార్చాయి. తర్వాత ఎవరూ ఈ పేరు పెట్టుకోలేదు.

ఇవాళ రాజా విక్రమార్క టీజర్ ని విడుదల చేశారు. ఎన్ఐఏ ఆఫీసర్ గా పని చేసే విక్రమ్(కార్తికేయ)కు చిన్నప్పటి నుంచి ఇలాంటి అడ్వెంచరస్ జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇందులో జాయిన్ అయ్యాక అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. నైజీరియా ముఠాలను పట్టుకుని మట్టుబెట్టడం, పాకిస్థాన్ తీవ్రవాదుల జాడలు కనిపెట్టడం ఇదో నిత్యకృత్యంగా మారిపోతుంది. ఒకదశలో సరదా మొత్తం తీరిపోయిందనే ఫీలింగ్ కూడా వస్తుంది. అసలు ఇతను చేపట్టిన మిషన్ ఏంటి, ఫైనల్ గా లక్ష్యం చేరుకున్నాడా లేదా, ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి

తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కార్తికేయ మొదటిసారి తన ఇమేజ్ కి భిన్నమైన పాత్ర చేసినట్టు కనిపిస్తోంది. సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన్, సుధాకర్ కొమాకుల, సూర్య, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర తారాగణం. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కు తగ్గట్టు సాగింది. పిసి మౌళి ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో కనిపించింది. ఆ మధ్య చూసిన అడవి శేష్ గూఢచారి పోలికలు అక్కడక్కడా కనిపిస్తున్నా కూడా రాజా విక్రమార్క మొత్తానికి ఆసక్తినైతే రేపగలిగింది. ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాని ఈ సినిమాకు రామారెడ్డి నిర్మాత. షూటింగ్ చివరి స్టేజి లో ఉంది

Also Read : సెప్టెంబర్ 13 - వన్ సైడ్ వారేనా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp