ఈ ఫిష్ కర్రీ మసాలా వాడుతున్నారా? అయితే డేంజర్ లో పడినట్లే!

ఇండియాలో ప్రముఖ బ్రాండెడ్ మసాలాలో ఎవరెస్ట్ మసాలా కూడా ఒకటి. అయితే తాజాగా ఈ ఎవరెస్ట్ మసాలా బ్రాండ్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కనుక మీలో ఎవరైనా ఈ ఫిష్ కర్రీ మసాలా వాడుతుంటే వెంటనే ఈ విషయాలను తెలుసుకోండి.

ఇండియాలో ప్రముఖ బ్రాండెడ్ మసాలాలో ఎవరెస్ట్ మసాలా కూడా ఒకటి. అయితే తాజాగా ఈ ఎవరెస్ట్ మసాలా బ్రాండ్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కనుక మీలో ఎవరైనా ఈ ఫిష్ కర్రీ మసాలా వాడుతుంటే వెంటనే ఈ విషయాలను తెలుసుకోండి.

భారతదేశంలో ప్రముఖ బ్రాండెడ్ మసాలాలో ఎవరెస్ట్ మసాలా కూడా ఒకటి. ఇప్పటికే మార్కెట్ లో ఈ ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు అనేవి వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో, బిర్యానీ మసాలా, విజిటెబ్ ల్ మసాలా,చికెన్, ఫిష్ వంటి రకరకాల మసాలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఏ కూరాల్లో అయిన ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసే మసాలా మిశ్రమాలను వేసుకునే వారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇన్‌స్టెంట్ గా దొరికే ఈ మసాలా పౌడర్లను వినియోగించడానికి అందరూ అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే మార్కెట్ లో రకరకాల పేర్లతో ఫుడ్ మసాలా పౌడర్లు అందుబటులోకి వచ్చాయి. ఇక మార్కెట్ లో ఎన్ని బ్రాండ్ మసాలా పౌడర్లు ఉన్నా..టేస్ట్ లో ది బెస్ట్ ఎవరెస్ట్ అంటూ ప్రతిఒక్కరూ దీనిని వినియోగిస్తుంటారు. అయితే తాజాగా ఈ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

పాపులర్ మసాలా బ్రాండ్ లో ఒకటి అయిన ఎవరెస్ట్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  కాగా, భారత్ లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలలో పురుగుమందు అవశేసాలు అధిక స్థాయిలో ఉన్నాయని సింగ్ పూర్ ఆరోపించింది.  అలాగే ఈ మసాలా మిశ్రమంలో మానవ వినియోగానికి పనికిరాని పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందని గుర్తించిన  హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ప్రతిస్పందనగా చర్య తీసుకున్నట్టు ఈమేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఇక అందులో  అందులో ఫిష్ మసాలాలో పరిమితులు దాటి ఇథిలిన్ ఆక్సైడ్ ఉందని హైలైట్ చేసింది. అయితే భారత్‌లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీచేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా.. వాటిని వెంటనే రీకాల్ చేయాలని సింగ్‌పూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) నిన్న అనగా గురువారం ఏప్రిల్ 18న ఓ ప్రకటనలో విడుదల చేసింది. అలాగే ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆదేశించింది.

కాగా, ఇథిలీన్ ఆక్సైడ్ ను సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులను సూక్ష్మజీవుల నాశనం చేయకుండా ఉండేందుకు పురుగుల మందుగా వినియోగిస్తారు. అయితే ఆహార ఉత్పత్తుల్లో మాత్రం దీని వినియోగంపై నిషేధం విధించారు. పైగా దీని వినియోగించడం వలన దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుందని ఫడ్ ఏజెన్సి తెలిపింది.  ఇక సింగపూర్ నిబంధనల ప్రకారం.. ఈ మసాలా దినుసుల స్టెరిలైజేషన్‌లో అనుమతించదగిన స్థాయిలో ఉన్నప్పటికీ, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో మాత్రం అధిక మొత్తంలో ఉండటం వల్ల ఇది అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని SFA తెలిపింది. అయితే ఈ ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వ్యక్తులు వైద్యుల సలహా తీసుకోవడం మంచింది. అలాగే ఇతర సమాచారం కోసం వారి కొనుగోలు కేంద్రాలు సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. కానీ, ఈ ఎవరెస్ట్ ఫిష్ మసాలా పై వస్తున్న ఆరోపణల పై ఆ సంస్థ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి, ప్రముఖ బ్రాండెడ్ ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో అధిక స్థాయిలో ఇథిలీన్ ఆక్సైడ్ కలిగివుందనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments