iDreamPost
android-app
ios-app

2023లో శృతిహాసన్ ట్రిపుల్ బొనాంజా

  • Published Dec 17, 2022 | 11:57 PM Updated Updated Dec 17, 2022 | 11:57 PM
2023లో శృతిహాసన్ ట్రిపుల్ బొనాంజా

ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోల సరసన ఒకే టైంలో ఒకే హీరోయిన్ నటించడం సాధారణంగా ఉండేది. విజయశాంతి రాధా రాధికా ఎక్కడ చూసినా వీళ్ళే కనిపించారు. స్టార్లు ఏడాదికి అయిదారు సినిమాలు చేసేవారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో జోడిని రిపీట్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. ఏడాదికి ఒకటి చేయడమే గగనమైపోతున్న ట్రెండ్ లో తమపక్కన ఆడిపాడే భామలు రిపీట్ అయినా లేదా అపోజిషన్ లో ఉన్నా ఇప్పటి జెనరేషన్ స్టార్లు ఒప్పుకోవడం లేదు. కానీ శృతి హాసన్ మాత్రం ఇలాంటి ట్రెండ్ లో ఒక అరుదైన ఘనత సాధించింది. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో ఆడిపాడుతూనే బాలకృష్ణ వీరసింహారెడ్డిలో ఫ్యాక్షన్ లీడర్ తో కలిసి కాలు కదుపుతోంది.

రెండూ ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ తో సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గతంలో సిమ్రాన్ కు ఈ ఘనత దక్కింది. 2001లో అచ్చం ఇదే టైపు లో పండక్కు క్లాష్ అయిన మృగరాజు, నరసింహనాయుడులో తనే కథానాయిక. వాటిలో బాక్సాఫీస్ వద్ద బాలయ్యదే పైచేయి అయ్యింది. తర్వాత మళ్ళీ ఈ తరహా మెగా నందమూరి సీనియర్లతో ఆడిపాడిన హీరోయిన్లు లేరు. ఇన్నేళ్ల తర్వాత శృతి హాసన్ కు ఆ ఛాన్స్ దక్కింది. సుగుణ సుందరి అంటూ ఒకదాంట్లో శ్రీదేవి అంటూ మరోదాంట్లో ప్రత్యేకంగా తన మీదే లిరిక్స్ రాయించి మరీ కంపోజ్ చేయించడం గమనార్హం. రెండూ విదేశాల్లోనే చిత్రీకరణ జరపడం మరో విశేషం

తండ్రి కమల్ హాసన్ సమకాలీకులు అయిన చిరు బాలయ్యతో డాన్స్ చేయడం ఒక ఎత్తైతే మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ లో నటించడం కూడా ఈ సంవత్సరమే జరిగింది. 2023లోనే ఈ మూడు రిలీజవుతాయి. గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, బలుపు లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒకప్పుడు మంచి ఫామ్ ఎంజాయ్ చేసిన శృతి హాసన్ కు ఇప్పుడీ మూడింట్లో రెండు హిట్ అయినా చాలు సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. జరిగే సూచనలైతే ఉన్నాయి. ప్రస్తుతం చిరుతో మరో పాట షూట్ కోసం ఫారిన్ లోనే ఉన్న శృతి తిరిగి వచ్చాక ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది. వీటికి సంబంధించిన ప్రశ్నలకు ఎలాంటి బదులిస్తుందో

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom