iDreamPost
iDreamPost
ఓ రెండు మూడు నెలల క్రితం చిరంజీవి ఆచార్యలో మహేష్ బాబు ఖచ్చితంగా నటిస్తాడు అనే రేంజ్ లో ప్రతి మీడియా వర్గంలోనూ గట్టి ప్రచారమే జరిగింది . దానికి తగ్గట్టే రెండు వైపులా ఎలాంటి ఖండన రాకపోవడంతో అదంతా నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ఓ పత్రిక రిపోర్టర్ చిరంజీవితో ఫోన్ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తే అసలు మహేష్ కూడా బిడ్డ లాంటి వాడే అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒకవేళ కలిసి చేయాల్సి వస్తే అంతకన్నా కావలసింది ఏముంటుంది అన్నట్టుగా మరో హింట్ కూడా ఇచ్చారు.
ఇదలా ఉంచితే తాజాగా కొరటాల శివ దీని గురించి తన వెర్షన్ చెప్పాడు. ముందు అనుకున్నది రామ్ చరణే అని కాని ఆర్ఆర్ఆర్ పూర్తవ్వకుండా డేట్స్ సర్దుబాటు కాకపోతే ఆచార్య రిలీజ్ అలస్యమవుతుందనే టెన్షన్ లో ఉన్నప్పుడు అనుకోకుండా మహేష్ తో మాట్లాడాల్సి వచ్చిందట. కబుర్ల ప్రస్తావనలో ఆచార్య రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారని మహేష్ అడిగితే ఇంకా ఏమి తేలలేదని అందుకే కాస్త టెన్షన్ గా ఉందని కొరటాల శివ చెప్పారు. దాంతో ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే నేనున్నానని ధైర్యం చెప్పారట.
అంటే అది పాత్ర పరంగానా లేక విడుదల విషయంలో ఫైనాన్షియల్ గా ఏదైనా హెల్ప్ చేయడంలోనా అనే క్లారిటీ లేదు. కొణిదెల సంస్థకున్న వనరులకు డబ్బు పరంగా ఎలాంటి చిక్కులు లేవు. ఒకవేళ రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు ముందే చరణ్ ను ఇవ్వనంటే అప్పుడు వచ్చేది అసలు సమస్య. మరి ప్రిన్స్ హామీ ఇచ్చింది ఆ కోణంలోనా కాదా అనే స్పష్టత ప్రస్తుతానికి లేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎక్కువ గ్యాప్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ పరశురాం దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా మే 31న మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. కరోనా అప్పటికంతా సర్డుకుంటే పూజా కార్యక్రమాలు చేస్తారు లేదంటే ప్రకటనతో సరిపుచ్చుతారు.