iDreamPost
iDreamPost
నిన్న మహేష్ బాబు సర్కారు వారి పాటలో మొదటి లిరికల్ సాంగ్ తాలూకు వీడియో లీక్ కావడం సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనలు రేపింది. వాట్స్ అప్, ఇన్స్ టా, ట్విట్టర్ అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా దాన్ని కొందరు అత్యుత్సాహంతో షేర్ చేయడంతో ఇది కాస్తా చాలా దూరం వెళ్లిపోయింది. ఒరిజినల్ డేట్ కన్నా ముందే ఈ రూపంలో వస్తే అభిమానులకే ఇంత బాధ కలిగితే ఇక యూనిట్ గురించి చెప్పేదేముంది. సంగీత దర్శకుడు తమన్ తన ఆవేదనను ఆడియో క్లిప్ రూపంలో పంచుకోవడం ఫ్యాన్స్ ని కలిచివేసింది. సినిమా టీమ్ లోనే ఇద్దరు ముగ్గురిని బాధ్యులుగా గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి కానీ ఇంకొంత క్లారిటీ రావాలి.
సరే వాళ్ళు దొరకడం దొరకకపోవడం గురించి కాసేపు పక్కనపెడితే ఈ లీకుల ప్రహసనం అన్నీ పెద్ద సినిమాలకూ జరుగుతున్నదే. సెల్ ఫోన్ కెమెరాలు వచ్చాక వీటికి అడ్డుకట్ట వేయడం మహా కష్టంగా మారిపోయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీ సైతం వీటి బారిన పడ్డాయి. లొకేషన్లో రహస్యంగా షూట్ చేసి వాటిని స్నేహితులకు పంపడం అవి కాస్తా ఏదో ఒక రూపంలో బయటికి రావడం కామన్ అయిపోయింది. ఎంత కఠినమైన ఆంక్షలు పెడుతున్నా సరే ఇవి ఆగడం లేదు. షూటింగ్ స్పాట్ లో అంటే సరే కంట్రోల్ చేయలేం అనుకోవచ్చు. కానీ ఎడిటింగ్ పూర్తి చేసుకున్న లిరికల్ వీడియో ఫైనల్ వెర్షన్ కు ఇలా జరగడం క్షమించరానిది.
దెబ్బకు ముందు అనుకున్న తేదీ కన్నా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కళావతిని ఈ రోజే రిలీజ్ చేయబోతున్నారు. అసలు వెర్షన్ వేరే ఉంటుందని ఎవరూ నిరాశ పడవద్దని మైత్రి వాళ్ళు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలతో పాటు ప్రతిఒక్కరికి ఉంది. వాటిని స్ప్రెడ్ చేస్తున్న నెటిజెన్లను నిందించడం వల్ల ఎలాంటి లాభం లేదు. వాళ్ళ చేతులు ఆగవు. అక్కడిదాకా వెళ్లకుండా ఆపాల్సింది సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు. ఎప్పుడో అత్తారింటికి దారేది టైం నుంచి ఈ లీకుల వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉండటం విచారకరం. ఏమి చేయలేమా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే
Also Read : Bhama Kalaapam : భామా కలాపం రిపో