iDreamPost
iDreamPost
IIFA 2022 అబుదాబిలో జరిగింది. ప్రీమియర్‌ను త్వరలో టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈసారి IIFAలో సల్మాన్ ఖాన్(Salman Khan) మీదనే అందరి దృష్టి. వేదికపైకి రావడంతో హంగామా. తానే హోస్ట్‌గా మారిపోయాడు. తన వద్ద డబ్బు లేనప్పుడు సునీల్ శెట్టి ఎలా సాయం చేశాడు నుంచి బోనీ కపూర్ సినిమా ఆఫర్ చేయడం వరకు ఆడియన్స్ తో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడే తనను ఇన్ స్పైర్ చేసిన సాంగ్ గురించి సల్మాన్ మాట్లాడారు. ఇంతకీ ఆ పాట ఏంటి? పుష్ప సినిమాలోని ఊ అంటావా. ఈ పాటలో అల్లు అర్జున్ తో సమంత డ్యాన్స్ లో అదరగొట్టింది.
IIFA 2022 రెడ్ కార్పెట్‌పై, అతనికి నచ్చిన, స్ఫూర్తినిచ్చిన పాట చెప్పంటే, సల్మాన్ ఖాన్ పాటను కూడా కొద్దిగా పాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్. కిల్లర్ మూవ్ మెంట్సతో సాంగ్ ను పాపులర్ చేసిన సమంత , సల్మాన్ వీడియోకు స్వీట్ హార్ట్ ఎమోజీలతో ట్విట్టర్‌లో షేర్ చేశారు.
♥️♥️♥️ https://t.co/UzkF0PVspl
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప పార్ట్ 1: ది రైజ్’ హిందీళలో మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్, హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోయారు. ఇక, స్పెషల్ సాంగ్ ‘ఊ.. అంటావా మావా’ ఇండియానే ఊపేసింది. బోల్డ్ మూవ్స్‌తో ఆడియన్స్ కట్టిపడేసింది సమంత. ఈ సూపర్ హిట్ సాంగ్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా స్పందించారు.
ఇటీవలే దుబాయ్‌లో జరిగిన IIFA 2022 అవార్డుల ఫంక్షన్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. అందులో హోస్ట్ సల్మాన్ ను ‘ఇటీవల మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాట ఏది?’ అని అడిగారు. దానికి సల్లు భాయ్ ‘ఊ.. అంటావా మావా’ పాటని పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోపై సమంత రిప్లైగా మూడు రెడ్ హార్ట్ సింబల్స్‌ని షేర్ చేసింది. ఈ పాటను కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ సైతం.. స్పందించాడు.