iDreamPost
android-app
ios-app

Mahesh Babu: మహేష్ బాబుపై సల్మన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..!

  • Published Nov 26, 2024 | 2:34 PM Updated Updated Nov 26, 2024 | 2:34 PM

Mahesh Babu: మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటుడు.

Mahesh Babu: మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటుడు.

  • Published Nov 26, 2024 | 2:34 PMUpdated Nov 26, 2024 | 2:34 PM
Mahesh Babu: మహేష్ బాబుపై సల్మన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిజంగా బాబ్ అంటే బాబే. బాబులో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే ఆయనంటే నచ్చని వారు ఎవరు ఉండరు. సాధారణంగా ఫ్యాన్స్ హీరోలని పొగుడుతూ ఉంటారు. కానీ హీరోస్ బాబుని పొగిడేస్తారు. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకత. ఆయనకి ఎలాంటి పాన్ ఇండియా సినిమా అవసరం లేదు. జస్ట్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలు సోషల్ మీడియా తగలడిపోతుంది. కేవలం రీజనల్ సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 49 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా మహేష్ మెరిసిపోతాడు. గతంలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మహేష్ ని చూసి బాలీవుడ్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఈయనేంటి.. చూడ్డానికి అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అనుకున్నారు అంతా. అప్పుడు బాలీవుడ్ మీడియాలో మహేష్ హాట్ టాపిక్ గా మారాడు. బాగా ట్రెండ్ అయ్యాడు. ఇంకా అవుతున్నాడు కూడా. ఇక తాజాగా మరోసారి మహేష్ బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్నాడు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుని ఆకాశానికి ఎత్తేశాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. మహేష్ నిజ‌మైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ పొగిడేశారు స‌ల్మాన్ భాయ్. బిగ్ బాస్ 18 లో మాజీ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్క‌ర్ హౌస్ మెట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె మ‌హేష్ భార్య న‌మ్ర‌త సోద‌రి. ఆమెతో మాట‌ల సంద‌ర్భంలో మ‌హేష్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు హోస్ట్ సల్మాన్ ఖాన్. ఒక స్టార్ హీరోగా మ‌హేష్ ని.. నిజ జీవితంలో మ‌హేష్ ని పోల్చి స‌ల్మాన్ వివ‌రించిన తీరు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్క్రీన్ పై మహేష్ బాబు.. వాకింగ్ స్టైల్, యాక్షన్, లుక్స్ విషయంలో స్టైలిష్ సిగ్నేచర్ కలిగి ఉన్నాడు. కానీ నిజ జీవితంలో మహేష్ సాధారణ.. నిజమైన ఫ్యామిలీమ్యాన్! అని సల్మాన్ కామెంట్స్ చేశాడు.

స‌ల్మాన్ ప్ర‌శంస ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానుల్లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. సల్మాన్ మహేష్ బాబు సింప్లిసిటీని ప్రశంసించడం మహేష్ అభిమానులకు హార్ట్ టచింగ్ మూమెంట్ గా మారింది. మహేష్ ఏంటో, మహేష్ రేంజ్ ఏంటో మరోసారి సల్మాన్ మాటలు ద్వారా రుజువు అయ్యిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ కామెంట్స్ తో మహేష్ బాబు పేరు బాలీవుడ్ లో మరోసారి వైరల్ అవుతుంది. ఇక స‌ల్మాన్ ఖాన్ మ‌హేష్ పోకిరి మూవీని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మ‌హేష్ తో అప్ప‌టి నుంచే స‌ల్మాన్ కి మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు స‌ల్మాన్ – మ‌హేష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ కాంబినేషన్ కచ్చితంగా పాజిబుల్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş