iDreamPost
android-app
ios-app

Lawrence Bishnoi: ఎవరీ లారెన్స్ బిష్ణోయ్? సల్మాన్ ని ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నాడు?

Gangster Lawrence Bishnoi Biography And Full Story: లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమోగుతోంది. భారత్- కెనడా మధ్య దౌత్య పరమైన చిచ్చు రాజేసుకోవడానికి ఇతను కూడా కారణం. సల్మాన్ ఖాన్ విషయంలో యముడిలా తయారయ్యాడు. అసలు ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరో పూర్తి వివరాలు మీకోసం..

Gangster Lawrence Bishnoi Biography And Full Story: లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమోగుతోంది. భారత్- కెనడా మధ్య దౌత్య పరమైన చిచ్చు రాజేసుకోవడానికి ఇతను కూడా కారణం. సల్మాన్ ఖాన్ విషయంలో యముడిలా తయారయ్యాడు. అసలు ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరో పూర్తి వివరాలు మీకోసం..

Lawrence Bishnoi: ఎవరీ లారెన్స్ బిష్ణోయ్? సల్మాన్ ని ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నాడు?

లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమోగుతోంది. సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు కెనడా ప్రభుత్వం కూడా ఇతని పేరు తీయగానే.. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ సందర్భంగానే మరోసారి అందరూ లారెన్స్ బిష్ణోయ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే అసలు ఈ లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? ఇతను ఎందుకు గ్యాంగ్ స్టర్ అయ్యాడు? అతనికి సల్మాన్ ఖాన్ తో ఉన్న గొడవలేంటి? సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ కి 26 ఏళ్ల పగ ఎందుకు? సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యల వెనుక వీళ్ల లక్ష్యం ఏంటి? జైలులో ఉండి కూడా ఎలా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాడు? ఇలాంటి అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఎవరీ లారెన్స్ బిష్ణోయ్?:

ఈ 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ కి చెందిన వ్యక్తి. ఇతని సొంతూరు ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామం. లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందినవాడు. ఈ బిష్ణోయ్ వర్గం.. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా లారెన్స్ బిష్ణోయ్ బాగానే చదువుకున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ 12వ తరగతి తర్వాత పంజాబ్ యూనివర్సిటీ పరిధి DAV కాలేజ్ లో చేరాడు. లారెన్స్ బిష్ణోయ్ జాతీయ స్థాయి అథ్లెట్ కూడా. ఇతను తన న్యాయవాద విద్యను పూర్తి చేసుకున్నాడు. బిష్ణోయ్ పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా వ్యవహరించాడు. లారెన్స్ బిష్ణోయ్ కి గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇతను క్రైమ్ వైపు మళ్లాడు. విద్యార్థి సంఘం నాయకుడి ముసుగులోనే లారెన్స్ బిష్ణోయ్ అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించాడు. విద్యార్థి దశలోనే గ్యాంగ్ వార్స్ ని మొదలు పెట్టాడు. కాలేజ్ గ్యాంగ్ వార్ లో లారెన్స్ ప్రత్యర్థులు అతని ప్రియురాలిని సజీవదహనం చేశారు. అప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ పూర్తిస్థాయి క్రైమ్స్ మొదలు పెట్టాడు.

డాన్ గా ఎలా మారాడు?:

లారెన్స్ బిష్ణోయ్ కాలేజ్ నుంచే పక్కా క్రిమినల్ గా మారిపోయాడు. అతను ఏం చేయాలి అనేది అతనికి క్లారిటీ ఉంది. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు.. ఎదుటి వాళ్ల గుండెల్లో వణుకే అతని ఆస్తి. ఒక భయానకమైన గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. నరరూప రాక్షసుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు. ఇప్పుడు ఉత్తర భారతాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎదుటివారిని భయ పెట్టేందుకు.. కావాలంటే ప్రాణాలు కూడా తీసేస్తాడు. చిన్న చిన్న కాలేజీ గొడవల నుంచి.. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఇతని గ్యాంగ్ పేరు ప్రస్తావించే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. ఒక డాన్ లా ఇప్పుడు జైలు నుంచే అన్నీ పనులు చక్కబెడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ లారెన్స్ గ్యాంగ్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

సల్మాన్ తో గొడవేంటి?:

lawrence bisnoi 3

అసలు ఎవరు ఈ లారెన్స్ బిష్ణోయ్ అనే ప్రశ్న.. 2024 ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి వచ్చింది. ఎందుకంటే అప్పుడే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిపారు. అయితే అసలు సల్మాన్ ఖాన్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఇతనికి ఏం వచ్చిందో చూద్దాం. లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ తో వైరం ఇప్పటిది కాదు. అతని కోపం చాలా ఏళ్ల క్రితం మొదలైంది. నిజానికి ఈ పగ లారెన్స్ ఒక్కడితే కాదు.. మొత్తం బిష్ణోయ్ వర్గానిది. అసలు మ్యాటర్ ఏంటంటే.. బిష్ణోయ్ లకు కృష్ణ జింక అనేది ఎంతో పవిత్రమైనది. అలాంటి కృష్ణ జింకను 1998లో సల్మాన్ ఖాన్ వేటాడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు కూడా నడుస్తూనే ఉంది. బిష్ణోయ్ లకు పవిత్రమైన కృష్ణజింకను వేటాడంతోనే సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ కి మధ్య వైరం మొదలైంది. 2018 నుంచి సల్మాన్ ఖాన్ ని లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ గా పెట్టుకుంది. 2024లో మొదట సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ వద్ద లారెన్స్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటి మీద ఈ గ్యాంగ్ కాల్పులు జరిగింది. అప్పుడే వీళ్ల పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి.. సల్మాన్ ఖాన్ కి ప్రత్యేకంగా ఎలాంటి గొడవలు లేవు. కేవలం కృష్ణ జింక విషయంలోనే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు. తాజాగా ఈ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కి ఓ ఆఫర్ కూడా ఇచ్చింది. సల్మాన్ గుడికి వచ్చి.. క్షమాణప చెబితే.. దానిని పరిగణలోకి తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది.

సిద్ధూ మూసేవాలా- బాబా సిద్ధిఖీని ఎందుకు చంపాడు?:

lawrence bisnoi 2

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు ముందే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాను లారెన్స్ గ్యాంగ్ వెంటాడి కాల్చి చంపింది. విక్కీ ముదుఖేడా మరణానికి ప్రతీకారంగా సిద్దు మూసేవాలాను కాల్చి చంపారు. అంతేకాకుండా.. తన గ్యాంగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేసేందుకు కూడా లారెన్స్ ఇలాంటి హత్యలు చేస్తుంటాడు. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, NCP లీడర్ బాబా సిద్ధిఖీ హత్య కూడా ఆ కోవకే చెందుతుంది. ఈ హత్యతో లారెన్స్ గ్యాంగ్ కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. ఇలా చేయడం వల్ల తన గ్యాంగ్ గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. అంతేకాకుండా.. తన ప్రత్యర్థులకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఎక్కువగా పేరున్న వాళ్లు, పాపులర్ అయిన వారిని వీళ్లు టార్గెట్ చేస్తుంటారు.

జైలు నుంచే సెటిల్ మెంట్స్:

lawrence bisnoi 4

లారెన్స్ బిష్ణోయ్ కేవలం హత్యలు దందాలే కాదు.. స్మగ్లింగ్ కూడా చేస్తుందని తెలుస్తోంది. లారెన్స్ గ్యాంగ్ వెపన్ స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్ ATS ఈ విషయంలో లారెన్స్ గ్యాంగ్ మీద ఆరోపణలు చేస్తోంది. అలాగే లారెన్స్ బిష్ణోయ్ చాలాకాలంగా జైలులో ఉన్నాడు. కానీ, అతను ఎలాంటి ఆటంకాలు లేకుండా తన పనులు చక్కబెతున్నాడు. తన గ్యాంగ్ ని సమర్థంగా నడిపిస్తున్నాడు. ఈ విషయంలో చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు అతను జైలు నుంచి గ్యాంగ్ ఎలా నడిపిస్తున్నాడు అని అంతా అనుకుంటున్నారు. బ్యారక్ లలో అక్రమంగా వచ్చే ఫోన్ల ద్వారా ఈ పనులు నడిపిస్తున్నాడు అంటారు. ఆ ఫోన్స్ తోనే తన గ్యాంగ్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటాడు అని పేరుంది. అలా జైలు నుంచే తన గ్యాంగ్ ని నడిపిస్తున్నాడు అంటారు. లారెన్స్ సోదరుడు అన్మోల్, ఫ్రెండ్ గోల్డీ బ్రార్ బయట ఉండి.. లారెన్స్ గైడెన్స్ లో పనులు చక్కబెడుతున్నారు.

లారెన్స్ బిష్ణోయ్ కి ఏం కావాలి?:

లారెన్స్ బిష్ణోయ్ స్వతహాగా కాలేజ్ డేస్ నుంచే క్రిమినల్ గా మారిపోయాడు. తన ప్రేయసిని సజీవదహనం చేసిన తర్వాత పూర్తిగా క్రిమినల్ అయ్యాడు. ఇతనికి గ్యాంగుల నుంచి థ్రెట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే పోలీసులకు ఇతడి రక్షణ కత్తిమీద సాములా మారిపోయింది. ఇతని మీద చాలానే కేసులు ఉన్నాయి. అందుకే లారెన్స్ ని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లాలి అంటే రక్షణ విషయంలో చాలానే ఇబ్బందులు పడాలి. ఇంక లారెన్స్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే.. అతని టార్గెట్ చాలా పెద్దదే అంటున్నారు. ముంబయిలో ఖాళీగా ఉన్న మాఫియా కుర్చీని సాధించాలి అనేది లారెన్స్ టార్గెట్ గా చెబుతున్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ.. తన గ్యాంగ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాడు అంటున్నారు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీల హత్యలు ఆ కోవకు చెందినవే అంటారు. సమాజంలో పేరున్న వారిని టార్గెట్ చేస్తే.. వాళ్ల గ్యాంగ్ పేరు జనాల్లోకి వెళ్తుంది అనేది లారెన్స్ కాన్సెప్ట్. అలాగే ప్రత్యర్థులకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడని టాక్ కూడా ఉంది. దేశంలోనే అత్యంత భయానక గ్యాంగ్ గా ఇప్పటికే పేరు సాధించాడు. ముంబయిలో మాఫియా డాన్ గా ఎదగాలి అనేది లారెన్స్ కోరిక అని చెబుతుంటారు.

కెనడా ప్రభుత్వం ఆరోపణలు ఏంటి?:

భారత్- కెనడా సంబంధాలపై ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం.. అనుమానితుల్లో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చింది. ఇప్పుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్ హత్యకేసు పురోగతికి సంబంధించి రాయల్ కెనడియన్ మౌటెండ్ పోలీసులు వివారలు వెల్లడించారు. కెనడాలో భారత ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి భారత ఏజెంట్లు ప్రో ఖలిస్థానీలనను టార్గెట్ చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ప్రో ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకుని చాలా గ్రూపులో పనిచేస్తున్నాయి అన్నారు. అందులో ప్రముఖంగా బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినిపిస్తోందని చెప్పారు. అలాంటి బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని నమ్ముతున్నామన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.