iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇంట పెళ్లి సందడి..ఫోటోలు వైరల్!

  • Published Sep 23, 2024 | 3:25 PM Updated Updated Sep 23, 2024 | 3:25 PM

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఇక ఈ వివాహనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి. ఇక సామ్ ఇంట పెళ్లి సందడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఇక ఈ వివాహనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి. ఇక సామ్ ఇంట పెళ్లి సందడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...

  • Published Sep 23, 2024 | 3:25 PMUpdated Sep 23, 2024 | 3:25 PM
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇంట పెళ్లి సందడి..ఫోటోలు వైరల్!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖల ఇళ్లలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ ఆకాశ్ మేఘా తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరికొందరు సెలబ్రిటీలు తమ ఇంట జరిగే శుభకార్యలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇటీవలే లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ఇంట్లో పెళ్లి సందడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో కూడా ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఇక ఈ వివాహనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. ఇక సామ్ ఇంట పెళ్లి సందడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…

హీరోయిన్ సమంత సోదరుడు డేవిడ్  ప్రభు వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. అమెరికాలో అతడి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఆదివారం డేవిడ్ ప్రభు వివాహం నికోల్ తో క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను  అతడి సోదరి సమంత సోషల్ మీడియాలో పంచుకుంది. ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ.. కుటుంబంతో కలిసి గడిపిన మధురమైన క్షణాలను ఫ్యాన్స్ తో షేర్ చేసింది. ఇకపోతే సమంత ఈ పెళ్లి వేడుకలల్లో  చాలా స్టైలిష్  లుక్ లో కనపడుతూ సందడి చేసింది. ఊదా రంగు డిజైన్ గౌన్ లో శామ్ మెరిసిపోతుంది.

ముఖ్యంగా ఆ ఆ డ్రెస్ లో పూలగుత్తి పట్టుకొని వస్తుంటే దేవకన్యలా ఉంది. ఇంకా చెప్పాలంటే… ఆమె పెళ్లి కూతురేమో అన్నంత అందంగా ఉంది  సమంత. ఇలా సామ్ ను చూసి చాలా కాలం అవ్వడంతో అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు. అంతేకాక సమంత ఇంట జరిగిన  పెళ్లి ఫోటోలను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇక సమంత సోదరుడికి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.  సమంత విషయానికి వస్తే.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మెన్ సిరీస్ నిర్మాతల్లో ఒకరైన రాజ్ నిడమూరుతో సమంత ప్రేమలో పడిందనే టాక్ వినిపించింది.

త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ న్యూస్ పై ఇప్పటివరకు సమంత కానీ, రాజ్ కానీ స్పందించలేదు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా మా ఇంటి  బంగారం అనే సినిమాతో బిజీగా ఉంది. కోలీవుడ్ లో  విజయ్ చివరి సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ అని ప్రచారం నడుస్తోంది. ఇవే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్స్ కు సామ్ సైన్ చేసిందని టాక్. మొత్తంగా సమంత ఇంట్లో జరిగిన పెళ్లి సందడి ఫోటోలపై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet