iDreamPost
android-app
ios-app

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మెసేజ్.. ఏం చేసిందంటే?

  • Published Oct 18, 2024 | 12:29 PM Updated Updated Oct 18, 2024 | 12:29 PM

Salman Khan: గత కొంత కాలంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. సల్లూ భాయ్ స్నేహితుడు బాబా సిద్దీఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ నువ్వే మా నెక్ట్స్ టార్గెట్ అంటూ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది.

Salman Khan: గత కొంత కాలంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. సల్లూ భాయ్ స్నేహితుడు బాబా సిద్దీఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ నువ్వే మా నెక్ట్స్ టార్గెట్ అంటూ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది.

  • Published Oct 18, 2024 | 12:29 PMUpdated Oct 18, 2024 | 12:29 PM
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మెసేజ్.. ఏం చేసిందంటే?

ఇప్పుడు సినీ, రాజకీయాల్లో ఎక్కడ చూసినా లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతుంది.  సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దీఖీ హత్య తర్వాత ఈ గ్యాంగ్ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దీఖీ హత్య తర్వాత నెక్ట్స్ టార్గెట్ నువ్వే సల్మాన్ ఖాన్ అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్  ఇచ్చారు.   ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. ఈ తరుణంలో గ్యాంగ్ స్టర్ పేరు ప్రస్తావిస్తూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన పోస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ‘నమస్తే లారెన్స్ బిష్ణోయ్ జీ.. జైల్లో ఉండి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని నాకు తెలుసు. నేను మీతో కొన్ని విషయాలు చర్చించాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? నాకు ఈ ప్రపంచంలో రాజస్థాన్ ఎంతో ఇష్టమైన ప్రదేశం. నేను మిమ్మల్ని కలిసే ముందు ఒక్కసారి మీతో జూమ్ కాల్ లో మాట్లాడుతాను. ఆ తర్వాత రాజస్థాన్ కి వెళ్తాను. దయచేసి నన్ను నమ్మండి.. ఇదంతా మీ మంచి కోసమే చెబుతున్నా. మీ మొబైల్ నెంబర్ ఇస్తే.. చాలా సంతోషిస్తా’ అంటూ సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేసింది. అలాగే లారెన్స్ బిష్ణోయ్ ఫోటో కూడా షేర్ చేసింది. ప్రస్తుతం లారెన్స్ గుజరాత్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.  సల్లూ భాయ్ మాజీ లవర్ సోమీ అలీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక సోమీ అలీ విషయానికి వస్తే.. ఆమె పాకిస్థానీ అమెరికన్ నటి. గతంలో పలు బాలీవుడ్ మూవీస్ లో నటించింది. మాఫీయా, ఆందోళన్ మూవీస్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. సల్మాన్ ఖాన్ తో సోమీ అలీ హీరోయిన్ గా ఓ మూవీ ప్రకటించారు. కానీ ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలోనే సోమీ అలీ – సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని బీ టౌన్ లో తెగ వార్తలు వచ్చాయి. అంతే కాదు పలు ఇంటర్వ్యూల్లో సోమీ అలీ.. తనకు సల్మాన్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని.. అతనికి నా ప్రేమను తెలియజేశానని చెప్పింది.

కొంత కాలం వీరు డేటింగ్ లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ ఏమయిందో తెలియదు కానీ.. వీరిద్దరూ కొంత కాలం తర్వాత విడిపోయారు. తర్వాత సల్మాన్ ఖాన్ పై సోమీ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘సల్మాన్ ఖాన్ ఒక మానసిక రోగి, అతడు అమ్మాయిలను దారుణంగా హింసిస్తాడు, అతనికి వ్యతిరేకంగా ఉంటే కెరీర్ లేకుండా చేస్తాడు, ఆయను అభిమానించడం మానేయండి, అతడు ఓ శాడిస్ట్ ’ అంటూ తీవ్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో దాన్ని తొలగించింది. ప్రస్తుతం సోమీ అలీ..గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి మెసేజ్ పెట్టడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking