iDreamPost
ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో అదే స్థాయి ఫలితం అందుకుంటుందన్న గ్యారెంటీ లేదని చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది.
ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో అదే స్థాయి ఫలితం అందుకుంటుందన్న గ్యారెంటీ లేదని చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది.
iDreamPost
ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో అదే స్థాయి ఫలితం అందుకుంటుందన్న గ్యారెంటీ లేదని చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. మళయాలంలో అందరూ వేనోళ్ళా పొగిడిన అయ్యప్పనుం కోశియుమ్ తెలుగులో పవన్ కళ్యాణ్ రానా లాంటి పెద్ద స్టార్లు కలిసి నటించినా జస్ట్ పాస్ అయ్యిందే తప్పించి గుర్తుండిపోయేంత గొప్పగా ఆడలేదన్నది వాస్తవం. అలా అని అన్నింటికి అదే జరుగుతుందని కాదు. మా అన్నయ్య, సూర్యవంశం, చంటి, ఘరానామొగుడు, గబ్బర్ సింగ్ లాంటివి ఒరిజినల్ వెర్షన్లకు ధీటుగా ఇంకా చెప్పాలంటే అంతకంటే బాగా ఆడినవి. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం హిందీ విక్రమ్ వేదా. మొన్న ముప్పైన గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే
తమిళ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ మైటీ మెగా మూవీని టైటిల్ మార్చకుండా అదే దర్శకులు పుష్కర్ గాయత్రిలని తీసుకొచ్చి హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ లాంటి క్రేజీ కాంబోతో రీమేక్ కు పూనుకున్నప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. వార్ తరహాలో మరో బంపర్ హిట్ ఖాయమని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద విక్రమ్ వేదా ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోతోంది. మూడు రోజులకు గాను కేవలం 37 కోట్లు మాత్రమే రాబట్టి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది. హిందీలో పొన్నియన్ సెల్వన్ అద్భుతాలేం చేయకపోయినా ఇంత తక్కువ మొత్తం రావడం ఊహించనిది. ఈ స్థాయిలో బోల్తా కొట్టడం ఆశ్చర్యమే.
విక్రమ్ వేదా తమిళం నుంచి హిందీ డబ్బింగ్ ఇప్పటికీ కొన్ని మిలియన్ల జనాలు చూసేశారు. అంతగా ఆసక్తి లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. దానికి తోడు విజయ్ సేతుపతి మాధవన్ ల టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో హృతిక్ సైఫ్ లకు పోలిక రావడం మరో రీజన్. వీళ్లిద్దరూ తమ బెస్ట్ ఇచ్చినప్పటికీ జనం కంటికి అంతగా ఆనడం లేదు. ఒకవేళ ఇలాంటి స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా తీసుకుని ఉంటే బాగుండేది కానీ అసలు చిక్కంతా రీమేక్ కావడం వల్లే వచ్చింది. దసరాకి చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం ఒకటే విక్రమ్ వేదాకున్న సానుకూల అంశం. దీన్ని సరిగ్గా వాడుకుంటే కొంతలో కొంత రికవర్ అవుతుంది కానీ లేదంటే హృతిక్ ఇన్నేళ్ల కష్టానికి ఇంత గ్యాప్ కి ఫ్యాన్స్ కోరుకున్న న్యాయం జరగనట్టే