సచిన్ టెండుల్కర్..ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్ కూడా. క్రికెట్ అభిమానులకు ఈయన దేవుడు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు క్రికెట్ ప్రపంచంలో రారాజులాగా ఒక వెలుగు వెలిగాడు. క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరును లిఖించుకున్నారు. అతి పిన్నవయస్సులేనో భారత రత్నను అందుకుని రికార్డు సృష్టించాడు. రిటైర్డమ్మెంట్ తరువాత కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. అందుకే ఆయనను వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు, అవహగాన కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తుంటారు. తాజాగా భారత ఎన్నికల సంఘం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత కూడా పలు రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయనకు నేషనల్ ఐకాన్ గా గుర్తింపు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఇరు వర్గాల మధ్య బుధవారం ఒప్పందం జరగనుంది. ఈ అగ్రిమెట్ ప్రకారం.. సచిన్ మూడేళ్ల పాటు నేషనల్ ఐకాన్ స్టార్ గా ఉండనున్నారు. ఈ హోదాలో ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతారు.
దేశ వ్యాప్తంగా ఓటర్ల లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగం కానున్నారు. గతంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. యువత సచిన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్రికెట్ గాడ్ క్రేజ్ ను ఉపయోగించి.. ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ లెజండరీ క్రికెటర్ ను నేషనల్ ఐకాన్ గా నియమించనుంది. గతంలో బాలీవుడ్ నటులు, క్రీడా విభాగం నుంచి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాక్సర్ మేరీ కోమ్ లోక్ సభ ఎన్నికల సమయంలో నేషన్ ఐకాన్లుగా సేవలు అందించారు. మరి.. తాజాగా సచిన్ ను ఐకాన్ స్టార్ గా ఎన్నిక సంఘం నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: వైష్ణవి సెలబ్రేషన్ వీడియో రిలీజ్! అదరగొట్టేసింది!