iDreamPost
iDreamPost
ఇవాళ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కు థియేటర్ల వద్ద సినిమా రేంజ్ లో హంగామా జరుగుతోంది. సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటోలు వార్తలతో హోరెత్తిపోతోంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక జనవరి 7న జరగబోయే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు అందటం లేదు. అయితే సినిమా హాళ్లలో 10 గంటలకు విడుదల చేస్తున్న ట్రైలర్ ని యుట్యూబ్ లో మాత్రం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయడం పట్ల చరణ్ తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంత ఆలస్యమైతే సెల్ ఫోన్లలో తీసిన పైరసీ వీడియోలు హల్చల్ చేస్తాయని దాని వల్ల ఆన్ లైన్ రికార్డులకు గండి పడుతుందని వాళ్ళ బాధ. ఇదే వ్యక్తపరుస్తున్నారు కూడా.
రాజమౌళి బృందం ఇదంతా ఆలోచించి ఉండదని చెప్పలేం. ఇప్పుడు టీమ్ కు లైకులు, మిలియన్ల వ్యూస్ కన్నా ఫీవర్ లా పాకిపోయే హైప్ అవసరం. ఇది ఆల్రెడీ ఉన్నప్పటికీ దీన్నింకా పీక్స్ కు తీసుకెళ్లాలి. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి చాటాలి. కేవలం మూడు నిమిషాల ట్రైలర్ కే జనం ఎంతగా ఊగిపోతున్నారో సాక్ష్యాలు చూపించాలి. ఒకవేళ యూట్యూబ్ లోనూ ఒకే టైంకి వదిలితే అప్పుడు థియేటర్లకు వెళ్లే పబ్లిక్ సంఖ్య తగ్గిపోతుంది. ఎలాగూ అరచేతిలోనే చూసే అవకాశం ఉన్నప్పుడు కష్టపడి హాలు దాకా ఎందుకు వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. అదే గంటల తరబడి గ్యాప్ ఉంటే అప్పటిదాకా ఆగలేక పరిగెత్తుతారు.
ఇప్పుడు ఫలితం కళ్ళముందు కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, మెహబూబ్ నగర్ లాంటి నగరాలతో మొదలుకుని విజయనగరం కర్నూల్ లాంటి పట్టణాల దాకా ఇద్దరు హీరో అభిమానులు చేస్తున్న రచ్చ మాములుగా లేదు. 10 గంటల తర్వాత నిజంగానే ఈ ట్రైలర్ టాక్ అఫ్ ది నేషన్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు. 4 దాకా ఇది చూడలేని సగటు ప్రేక్షకులు యుట్యూబ్ కోసం ఎదురు చూస్తారు. ఉదయం చూసిన వాళ్ళు అక్కడితో వదిలేయరు. ఇక్కడా వ్యూస్ తో మోత మోగిస్తారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సరిగ్గా నెల రోజులు చేతిలో పెట్టుకుని చేస్తున్న ప్లానింగ్ రాజమౌళి మార్కెటింగ్ బుర్ర గొప్పదనాన్ని చూపిస్తోందిగా
Also Read : Akhanda : బాలయ్య బ్లాక్ బస్టర్ సీక్వెల్ – ఛాన్స్ ఉందా