iDreamPost
android-app
ios-app

RRR మరో సరికొత్త రికార్డ్..

  • Published Jun 17, 2022 | 2:18 PM Updated Updated Jun 17, 2022 | 2:19 PM
  • Published Jun 17, 2022 | 2:18 PMUpdated Jun 17, 2022 | 2:19 PM
RRR మరో సరికొత్త రికార్డ్..

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి పలు రికార్డులని క్రియెట్ చేస్తూనే ఉంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారత దేశంలోనే కాక, విదేశాల్లో కూడా భారీ విజయం సాధించింది RRR సినిమా. ఇక కలెక్షన్స్ లోను ఈ సినిమా దూసుకెళ్లింది. దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి మరోసారి రాజమౌళి, తెలుగు సినిమా సత్తాని చాటాయి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మే 20నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో వచ్చిన తర్వాత మరింతమందికి ప్రపంచ వ్యాప్తంగా చేరువవడంతో RRR సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మరో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

RRR సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వ‌రుస‌గా మూడు వారాల పాటు అత్య‌ధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మొద‌టివారం 18 మిలియ‌న్ అవ‌ర్స్ పైగా వీక్షించ‌గా, రెండ‌వ వారం 13.9 మిలియ‌న్ల అవ‌ర్స్‌కు పైగా, తాజాగా మూడోవారం 5.23 మిలియ‌న్ల వ్యూస్‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా మూడు వారాలు కంటిన్యూగా ట్రెండ్ లో నిలిచిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా RRR సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా RRR సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాకుండా ఓటీటీలోనూ వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంది.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom