iDreamPost
android-app
ios-app

స్వరూపానంద..జగన్‌ల ఆత్మీయ అనుబంధం

స్వరూపానంద..జగన్‌ల ఆత్మీయ అనుబంధం

విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్రతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనుబంధం మరింత దృఢమవుతోంది. ఈ రోజు విశాఖలోని శ్రీ శారదా పీఠం వారోత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు పీఠంలో గడిపారు. పూజల్లో పాల్గొన్నారు.

ఎన్నికల ముందు సీఎం వైఎస్‌ జగన్‌కు స్వరూపానందేంద్ర స్వామి తన ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. పీఠంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వైఎస్‌ జగన్‌ హాజరవుతూ వస్తున్నారు. అంతేగాక పలు మార్లు స్వయంగా వెళ్లి సరూపంనందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామి కూడా వైఎస్‌ జగన్‌కు మంచి జరగాలని ఆభిలషించారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలంటూ బహిరంగంగా తన మనసులో మాటను వెల్లడించారు.

2019 ఎన్నికల్లో విజయం అందుకున్న తర్వాత సీఎం వైస్‌ జగన్‌ స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వైఎస్‌ జగన్‌ను స్వరూపానందేంద్ర స్వామి హత్తుకుని తన ప్రేమాప్యాయతను చాటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు పీఠాన్ని సీఎం జగన్‌ సందర్శించారు. తాజాగా పీఠం వారోత్సవాలకు హాజరై కార్యక్రమాల ఆసాంతం అక్కడే ఉండడం సీఎం వైస్‌ జగన్, స్వరూపానందేంద్ర స్వామి మధ్య గల అనుబంధాన్ని తెలియజేస్తోంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş