iDreamPost
android-app
ios-app

ఇటలీలో కరోనా ఇంతలా ప్రభలడానికి కారణం ఏంటి..?

ఇటలీలో కరోనా ఇంతలా ప్రభలడానికి కారణం ఏంటి..?

గత నవంబర్-డిసెంబర్ లలో చైనాలో పెద్ద ఎత్తున నిమోనియా కంప్లైంట్ తో హుబే ప్రావిన్స్ లోని వూహాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేషంట్లు ఆసుపత్రులలో చేరడంతో అనుమానం వచ్చిన వైద్యులు దానిని కరొనా వైరస్ (కొవిడ్ 19) గా గుర్తించారు. అయితే అప్పటికే అక్కడ కొంత జరగాల్సిన నష్టం జరిగిపొయింది. అయితే అతి కష్టం మీద వుహాన్ నగరాన్ని 3 నెలలు పాటు మిలటరీ పద్దతిలో అష్టదిగ్బంధనం చేసి ఆ నగరం తో బాహ్యప్రపంచానికి సంబంధాలు కట్ చేసి దేశం లో వైరస్ వ్యాపించకుండా అరికట్టడంలో చైనా కొంత మెర సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి.

మరి చైనా కు ఎంతో దూరంలో ఉన్న ఇటలీ కరొనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతుంది. కారణం ఎంటీ?? ఇటలీ కి – వుహాన్ నగరానికి కనెక్షన్ ఎంటీ?? వుహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ఇటలీ వంటి సుదూర దేశంలో ఎందుకు విస్తృతంగా వ్యాపించింది??

కారణం ఏమిటంటే.. మొదటి నుండి ఇటలీకి చైనాతో బలమైన వస్త్ర, వస్త్ర పరిశ్రమ వాణిజ్య సంబంధం ఉంది. ముఖ్యంగా వుహాన్ ప్రావిన్స్ తోపాటు వుహాన్ ప్రాంతానికి చెందిన లక్ష మంది చైనా కార్మికులు ఇటలీలోని వస్త్ర పరిశ్రమలో (ముఖ్యంగా ఉత్తర ఇటలీ) పనిచేస్తున్నారు. ఎప్పటి నుండో ఇటలీకి వుహాన్ నగరం నుండి ప్రతి నిత్యం డైరక్ట్ గా విమానాలు కూడా నడుస్తున్నాయి.

ఉత్తర ఇటలీలో చైనా నుండి వచ్చిన వలస జనాభా భారీగా ఉంది. వీరిలో చాలామంది వుహాన్ నుండి ఇక్కడ వచ్చి నివసిస్తున్న వారే. ఈ వ్యక్తులను పరీక్షించడానికి మరియు పరిమితం చేయడానికి బదులుగా, ఇటాలియన్ అధికారులు ఫిబ్రవరిలో “హగ్ ఎ చైనీస్” ప్రచారాన్ని ప్రారంభించారు. వారు ఇప్పుడు దానికి తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నారు. “నేను వైరస్ కాదు..నేను మానవుడిని.. చైనీయుల విషయంలో పక్షపాతాన్ని నిర్మూలించండి..”అనే క్యాంపైన్ తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర ఇటలీలో విడుదలైన వీడియోల సందేశం. అక్కడి ప్రభుత్వం విచిత్రంగా కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలను ప్రోత్సహించడానికి చైనా ప్రజలను కౌగిలించుకోవాలని ఇటాలియన్లను కోరారు.

అదే సమయంలో చైనీస్ న్యూ ఇయర్ 2020 ను జనవరి 25 నుండి ఫిబ్రవరి 8, 2020 వరకు జరుపుకున్నారు. కాబట్టి చాలా మంది చైనా వలసదారులు తమ కుటుంబాలతో కలిసి నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇటలీ నుండి వుహాన్ లోని తమ ఇంటికి వెళ్లారు. సెలవు తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు, ఇటాలియన్ విమానాశ్రయాలలో వారెవరిని పరీక్షించలేదు. దాంతో ఆ నిర్లక్ష్యానికి ఫలితం ఇప్పుడు ఇటలీ తో పాటు యావత్ ప్రపంచం అనుభవిస్తోంది.