iDreamPost
android-app
ios-app

రామారావు నష్టాలకు రవితేజ భరోసా

  • Published Aug 02, 2022 | 4:35 PM Updated Updated Aug 02, 2022 | 4:35 PM
రామారావు నష్టాలకు రవితేజ భరోసా

ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం గడవకుండానే తీర్పు వచ్చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఖిలాడి తాలూకు గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరోసారి ఇలాగే రిపీట్ కావడం వాళ్ళను కలవరపెడుతోంది. నష్టాలు సుమారుగా 12 కోట్లకు పైమాటే ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ డెఫిషిట్లో ఉన్న ఈ సినిమ అద్భుతాలు చేస్తుందని ఆశించడం అత్యాశే. దీని వల్లే మిక్స్డ్ టాక్ వచ్చిన కన్నడ డబ్బింగ్ విక్రాంత్ రోనా ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి మంచి వసూళ్లతో పది కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెట్టడం ఆశ్చర్యకరం.

ఇప్పుడీ రామారావు తాలూకు నష్టాలను భర్తీ చేసేందుకు నిర్మాత చెరుకూరి సుధాకర్ కు మరో సినిమా తక్కువ బడ్జెట్ లో రెమ్యునరేషన్ ఇబ్బంది లేకుండా చేస్తానని రవితేజ మాటిచ్చినట్టుగా ఫిలిం నగర్ అప్డేట్. ఇప్పటికిప్పుడు కాదు కానీ చేతిలో ఉన్న కమిట్మెంట్లు పూర్తయ్యేలోగా ఏదైనా కథను దర్శకుడిని లాక్ చేసుకుని ఆపై వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేద్దామని చెప్పారట. సరైన కథ పడితే రవితేజ ఈజీగా హిట్టు కొట్టడం క్రాక్ తో రుజువయ్యింది. కానీ కొత్త దర్శకులు తనను కనీస స్థాయిలో హ్యాండిల్ చేయలేకపోవడంతో ఇప్పుడీ ఇబ్బంది వచ్చి పడింది. శరత్ మండవ ఇంటర్వ్యూలో చూపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ మేకింగ్ లో లేకపోవడం దెబ్బ కొట్టింది.

స్టార్ హీరోలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆచార్యకు సైతం దారుణంగా నష్టాలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి ఇరవై కోట్ల దాకా సర్దారనే ప్రచారం కొద్దిరోజుల క్రితం జరిగింది. అదెంతవరకు నిజమో తెలియదు కానీ నిప్పు లేనిదే పొగరాదుగా అనేవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు రామారావుకు సైతం ఇలాంటి వెసులుబాటు ఇవ్వడం నిర్మాతకు మేలు చేస్తుంది. రవితేజ ప్రస్తుతం ధమాకా, వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులను ఒకేసారి లైన్ లో పెట్టాడు. ఇవయ్యాక మరో ఇద్దరు తమిళ దర్శకులు చర్చల్లో ఉన్నారు. వీళ్ళలో ఒకరితో రామారావు నిర్మాత కాంబో సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి