iDreamPost
android-app
ios-app

కెజిఎఫ్ 2లో షాకింగ్ పాత్రలో రవీనా

  • Published Feb 09, 2020 | 11:18 AM Updated Updated Feb 09, 2020 | 11:18 AM
  • Published Feb 09, 2020 | 11:18 AMUpdated Feb 09, 2020 | 11:18 AM
కెజిఎఫ్ 2లో షాకింగ్ పాత్రలో రవీనా

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సెట్స్ లో ఇవాళ్టి నుంచి నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రవీనాటాండన్ అడుగు పెట్టింది. రాఖీ భాయ్ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసేది ఈమె నంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టింది టీమ్. అయితే ఇన్ సైడ్ ప్రకారం ఇందులో రవీనా చేస్తోంది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన పవర్ ఫుల్ పాత్రట. ఇప్పటికి దీన్ని అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన వార్త గట్టిగా కనిపిస్తోంది.

కెజిఎఫ్ 2లో రాఖీ భాయ్ చేస్తున్న అరాచకం భరించలేక ప్రభుత్వం తరఫున డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని ఆ అధికారం ఇచ్చే వ్యక్తి దేశంలోనే ఉన్నత పదవిలో ఉండాలి ఆ మేరకు స్క్రిప్ట్ లో పాత్రను ఇలా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే నేరుగా ఇందిరా గాంధీ పేరు వాడితే అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేరే పేరుతో ఇంకో పదవిలో చూపించి తీసే అవకాశం ఉంది. రవీనాటాండన్ మన ప్రేక్షకులకు సుపరిచితురాలే.

బాలకృష్ణతో బంగారు బుల్లుడుతో స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చిన రవీనా ఆ తర్వాత రథసారధి లాంటి మరికొన్ని సినిమాలు చేసింది. మరీ పొడుగు సుందరి కావడంతో మన హీరోలు ఎక్కువగా తనకు ఆఫర్స్ ఇవ్వలేకపోయారు. ఉపేంద్ర తీసిన ఉపేంద్ర రవీనాకు మంచి గుర్తింపు తెచ్చింది. హిందీలో స్టార్ల సరసన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసిన రవీనా పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకుని ఇటీవలే కంబ్యాక్ ఇచ్చింది. 2017 నుంచి యాక్టివ్ గా ఉన్న రవీనా ఇకపై సౌత్ లోనూ ఎక్కువ సినిమాలు చేస్తానని చెబుతోంది.చూస్తుంటే టబులాగా గట్టి ప్లానింగ్ తోనే ఉన్నట్టుంది. కెజిఎఫ్ 2లో రవీనాతో పాటు సంజయ్ దత్ కూడా విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetaresbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio