కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తున్నందున దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ప్రజలు గుంపులుగా బయట తిరగడం నిషేధించారు. ప్రయాణాలు పూర్తిగా స్తంభింప జేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన తిరుపతి,షిరిడి,భద్రాచలం లాంటి ఆలయాలు సైతం మూతపడ్డాయి.
కానీ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రామ్‌లల్లా విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరలించారు. రామ్ లల్లా విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూసి ఆశీర్వాదం పొందవచ్చని విశ్వహిందూ పరిషత్ నాయకుడు వినోద్ కుమార్ బన్సాల్ తెలిపారు.
రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేసే తేదీ శ్రీరామనవమి సందర్భంగా ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామాలయం నిర్మాణము కోసం 11 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. కానీ కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న ఆందోళన లేకుండా ముఖ్యమంత్రి స్వయంగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి తరలించడంతో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.