iDreamPost
android-app
ios-app

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీ నుంచి నలుగురికి ఛాన్స్..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీ నుంచి నలుగురికి ఛాన్స్..

రాజ్యసభలో ఖాళీ కాబోతున్న మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ దఫా 17 రాష్ట్రాల్లోని 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4 స్థానాలు, తెలంగాణా లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కె.కేశవ రావు, తోటా సీతామాహాలక్మి, ఎం.ఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి స్థానాలు ఖాళీ కానుండగా, తెలంగాణ నుండి కెవిపి రామచందర్ రావు, గరికపాటి రామ్మోహన రావు స్థానాలు ఖాళి కానున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 6 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13 న నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా, మార్చి 16న రాజ్యసభ నామినేషన్ల పరిశీలన అనంతరం నామినేషన్లు ఉపసంహరణకు మార్చి 18 తుది గడువుగా నిర్ణయించారు. కాగా మార్చి 26 న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 26 న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం తుది ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు వైఎస్సార్ సీపీ కి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తరఫున పెద్దల సభకు వెళ్లే ఆ నలుగురు ఎవరనేది ఆసక్తి నెలకొంది.