iDreamPost
android-app
ios-app

Raashi Khanna : రాశి ఖన్నా ఇన్నింగ్స్ స్పీడందుకుంది

  • Published Nov 19, 2021 | 6:15 AM Updated Updated Nov 19, 2021 | 6:15 AM
Raashi Khanna : రాశి ఖన్నా ఇన్నింగ్స్ స్పీడందుకుంది

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్నాయని చింత ఏలా ఇతర భాషలు ఉండగా సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతోంది రాశి ఖన్నా. ఇటీవలి కాలంలో తనకు ఆఫర్లు తగ్గిన మాట వాస్తవం. ప్రతి రోజు పండగే హిట్ అయినా ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ గట్టి దెబ్బ కొట్టింది. దాని కోసం కొంత బోల్డ్ గా నటించినా లాభం లేకపోయింది. అందుకే తమిళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టిన రాశి ఖన్నాకు అక్కడా టైం కలిసి రావడం లేదు. ఈ ఏడాది విజయ్ సేతుపతితో చేసిన తుగ్లక్ దర్బార్, ఆర్యతో నటించిన అరణ్మయి 3 డిజాస్టర్ అయ్యాయి. మొదటిది ఓటిటిలో వదిలినా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. మలయాళం భ్రమమ్ కూడా సోసోగానే పేరు తెచ్చింది.

ఇక తెలుగు సంగతి చూస్తే గోపీచంద్ పక్కా కమర్షియల్ దాదాపు పూర్తయ్యే స్టేజి లో ఉంది. ఇటీవలే వదిలిన టీజర్ లో రాశిఖన్నాకు లాయర్ గా కాస్త గట్టి పాత్రే తగిలినట్టు ఉంది. మారుతీనే డైరెక్టర్ కాబట్టి క్లిక్ అయితే ప్లస్ అవుతుంది. నాగ చైతన్యతో చేసిన థాంక్ యు కూడా ఆల్రెడీ పూర్తయ్యింది. విడుదలకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. వీటి సంగతలా ఉంచితే హిందీలోనూ తనకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి లాంటి క్వాలిటీ క్యాస్టింగ్ ఉంది. వచ్చే ఏడాది స్ట్రీమ్ చేయబోతున్నారు.

అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో డిస్నీ హాట్ స్టార్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ రుద్రాలోనూ రాశి ఖన్నా ఉంది. ఇది ఇండియన్ ఓటిటిలో ఖరీదైన సిరీస్ గా టాక్ ఉంది. ఇవి కాకుండా కరణ్ జోహార్ బ్యానర్ లో వస్తున్న యోధాలోనూ ఈ బ్యూటీ ఉంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజవుతుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరో కాగా దిశా పటాని మరో హీరోయిన్. మొన్న దీనికి సంబందించిన హీరో లుక్ ని విడుదల చేశారు. ఈ లెక్కన చూస్తుంటే జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నా ఇంత బిజీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీపముండగానే ఇల్లు కాదు ఏకంగా వీధినే చక్కదిద్దుకోవడం అంటే ఇదేనేమో

Also Read : Oke Oka Jeevitham : ఫ్యామిలీ సినిమాకు ఓటిటి రూటు తప్పేలా లేదు