Pushpa : లక్ష్యానికి చేరువలో ఐకాన్ స్టార్ సినిమా

విపరీతమైన ఒత్తిళ్లు చివరి నిమిషం టెన్షన్లు అన్నీ తట్టుకుని డిసెంబర్ 17 విడుదలైన పుష్ప ది రైజ్ పార్ట్ 1 నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వసూళ్లు సాధిస్తోంది. అల వైకుంఠపురములో తరహాలో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం దీన్ని కొంచెం టెన్షన్ పెట్టినప్పటికీ మాస్ ఆడియన్స్ కి పుష్పని మించిన ఆప్షన్ లేదన్నట్టుగా గత రెండు వారాలుగా వస్తున్న రిలీజులు నీరసం తెప్పించాయి. ఉన్నంతలో శ్యామ్ సింగ రాయ్ ఎఫెక్ట్ పుష్ప మీద అర్బన్ సెంటర్స్ లో పడింది. కానీ బిసి కేంద్రాల్లో మాత్రం జనం అయితే పుష్ప లేదంటే అఖండ అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టైమింగ్ ఈ రెండు సినిమాలకు బాగా కలిసి వచ్చింది.

ఇక వసూళ్ల విషయానికి వస్తే పుష్ప ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మార్కుని దాటినట్టు ట్రేడ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లోనే 75 కోట్ల దాకా ఆల్రెడీ వచ్చేసిందని అంటున్నారు. ఏపిలో నెలకొన్న పరిణామాలు, టికెట్ ధరల ఇష్యూ, కొన్ని థియేటర్ల మూసివేత లాంటివి ఫిగర్స్ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం. అయినప్పటికీ పుష్పకు వీకెండ్లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. శ్యామ్ సింగ రాయ్ కు దక్కిన లిమిటెడ్ రిలీజ్ కూడా బన్నీకి కలిసి వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉన్న 150 కోట్లను చేరుకోవడం అసాధ్యం కాదు కానీ తెలుగు కంటే హిందీ మలయాళం వెర్షన్లలో పుష్ప చెలరేగిపోతుండటం అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

పుష్ప 2కి కావాల్సినంత హైప్ ని మొదటి భాగం పూర్తిగా ఇవ్వలేకపోయినా బిజినెస్ పరంగా మాత్రం వంద శాతం గ్యారెంటీని ఇచ్చింది. అసలు మ్యాటర్ అంతా సీక్వెల్ లో ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెబుతూ వస్తున్నారు కాబట్టి ఆ టైంకంతా బజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో డిమాండ్ ఎక్కువగా ఉందట. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ కంతా పూర్తి చేసి ప్రమోషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించేలా మైత్రి సంస్థ ప్లానింగ్ తో ఉందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ దీని తర్వాత చేయబోయే సినిమా గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇంకొద్దిరోజుల్లో ఏదైనా అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి

Also Read : Bheemla Nayak : మొదట్లో తిట్టుకున్నారు కానీ ఆ నిర్ణయమే కరెక్ట్

Show comments