iDreamPost
android-app
ios-app

చిరంజీవి తొలి దర్శకులు ఇక లేరు – Nostalgia

  • Published Feb 16, 2020 | 2:17 AM Updated Updated Feb 16, 2020 | 2:17 AM
చిరంజీవి తొలి దర్శకులు ఇక లేరు – Nostalgia

టాలీవుడ్ లో తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం పునాదిరాళ్లు దర్శకులు రాజ్ కుమార్ ఇవాళ అనారోగ్యంతో కన్ను మూశారు. గతంలోనే అస్వస్థతకు గురైనప్పుడు చిరంజీవి అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆ తర్వాత కొలుకున్నట్టే కనిపించినా తిరిగి కొంత కాలానికే పెద్ద కుమారుడు, భార్య కాలం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దానికి తోడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఆయన్ని ఇంకా కృంగదీశాయి.

పునాదిరాళ్లు లాంటి అభ్యుదయ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కుమార్ డెబ్యూ తోనే మహానటి సావిత్రి గారితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందులో హీరో నరసింహారాజు. అతని స్నేహబృందంలో ఒకడిగా ఆవేశపరుడిగా చిరంజీవి పాత్ర కనిపిస్తుంది. ఆ సమయంలో రాజ్ కుమార్ తో చక్కని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న చిరు ఇప్పటిదాకా కొనసాగిస్తూనే వచ్చారు. ఆయనతో జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతాప సందేశాన్ని విడుదల చేసారు.