iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ తో మొదటి కాంబినేషన్

  • Published Jan 27, 2020 | 11:53 AM Updated Updated Jan 27, 2020 | 11:53 AM
  • Published Jan 27, 2020 | 11:53 AMUpdated Jan 27, 2020 | 11:53 AM
పవర్ స్టార్ తో మొదటి కాంబినేషన్

అజ్ఞాతవాసితో పాతిక సినిమాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని జనసేన కోసం తాత్కాలిక విరామాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవలే పింక్ రీమేక్ తో మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటే సమాంతరంగా మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి లాంఛనంగా దీని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. మెగా సూర్య పిక్చర్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి ఇంకో విశేషం ఉంది.

సుప్రసిద్ధ సంగీత దర్శకులు కీరవాణి ఈ సినిమాకి ట్యూన్స్ కట్టబోతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో కీరవాణి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కు కంపోజింగ్ చేయలేదు. ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈయన ఆర్ఆర్ఆర్ మాత్రమే ఒప్పుకున్నారు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకునే కీరవాణిని క్రిష్ ఒప్పించడం విశేషమే. ఈ ఇద్దరు ఎన్టీఆర్ కథానాయకుడు-మహానాయకుడులతో పాటు గతంలో వేదం కోసం కలిసి పని చేశారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కోసం ఇది రిపీట్ అవుతోంది.

గతంలో కీరవాణికి మెగాస్టార్ చిరంజీవితో అద్భుతమైన హిట్స్ ఉన్నాయి. ఘరానా మొగుడు ఇప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఆ తర్వాత చేసిన ఆపద్బాంధవుడు మ్యూజికల్ హిట్ అయితే ఎస్పి పరశురాం మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత పవన్ కు కీరవాణి సంగీతం ఇవ్వడం అంటే మెగా ఫాన్స్ సం థింగ్ స్పెషల్ గానే ఫీలవుతారు. ఇప్పటికే మ్యూజిక్ సిటింగ్స్ జరిగాయని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా చెప్పబడుతున్న ఈ మూవీ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom