iDreamPost
android-app
ios-app

మాకు లాక్ డౌన్ వద్దు…..అమెరికాలో నిరసన

మాకు  లాక్ డౌన్ వద్దు…..అమెరికాలో నిరసన

అమెరికాలో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా నిరసనకారుల ర్యాలీలు

అమెరికాలో లాక్ డౌన్ పొడిగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలోనే కరోనా వైరస్ కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకూ 764,265 మంది కరోనా వైరస్ బారిన పడగా,40,565 మంది మృత్యువాత పడ్డారు.కాగా గత రెండువారాల్లో తొలిసారిగా న్యూయార్క్ లో కరోనా మృతులు తగ్గాయి. దాంతో న్యూయార్క్ లో మృతుల సంఖ్య 550 కన్నా తక్కువగా నమోదయింది.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా అగ్రరాజ్యం అతలాకుతలం అయింది. లాక్ డౌన్ పొడిగించడం వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఆకలి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారపోట్లాల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో అమెరికాలోని న్యూ హాంప్‌షేర్‌లో దాదాపు 400మంది పౌరులు రోడ్డుపైకి వచ్చి లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. స్వేచ్ఛగా జీవించండి లేదా చావండి అంటూ రోడ్లపై నిరసనలు తెలిపారు. లాక్ డౌన్ ను ఎక్కువ రోజులు పొడిగించడాన్ని నిరసనకారులు తప్పుబట్టారు. టెక్సాస్‌ నగరంలో కూడా కొన్ని వందలమంది ఆందోళనకారులు పొడిగించిన లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కొన్ని లక్షలమందికి పని లభించడం లేదని కాబట్టి ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆందోళన కారులు నినాదాలు చేశారు.

కాగా అమెరికాలో కొత్తగా నమోడవుతున్న కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంది.కొత్తగా ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య తగ్గింది. టెక్సాస్ లో దుకాణాలు త్వరలో తెరుచుకోనుండగా, ఫ్లోరిడాలో బీచ్ లు పార్కులకు సందర్శకుల రాక మొదలైంది. త్వరలోనే అమెరికా ఆర్ధిక స్థితిని చక్కబెట్టడానికి పలురాష్ర్టాల గవర్నర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు.