బ్రిటన్ ప్రధానికి సోకిన కరోనా

  • Published - 01:00 PM, Fri - 27 March 20
బ్రిటన్ ప్రధానికి సోకిన కరోనా

కరోనా వైరస్ సమాన్యులనే కాదు దేశాధినేతలను కూడా వణికిస్తుంది. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడో కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. తదనంతరం బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన యువరాజు వేల్స్ చార్లెస్ కు కూడా కరోనా సోకింది. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

దాంతో ఇంటికే పరిమితం కావాలని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు.

“నాలో కరోనావైరస్ లక్షణాలను స్వల్పంగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఆగకుండా దగ్గు వస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు నేను పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. నేను స్వీయ నిర్బంధం విధించుకుని ఇంటి నుంచే పని చేస్తాను” అని వీడియో సందేశం ద్వారా బోరిస్ జాన్సన్ వెల్లడించారు.

కాగా బ్రిటన్‌లో ఇప్పటివరకూ 11,600లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా 578 మంది చనిపోయారు. ప్రమాదకరమైన స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో బ్రిటన్ లాక్ డౌన్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Show comments